DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు గణపతి సాక్షిగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల ప్రమాణాల రచ్చ

*గర్భ గుళ్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల వాగ్వాదం* 

*కోట్లాది రూపాయల అవినీతిపై ప్రమాణాల సవాల్* 

*ప్రమాణాలు సరిగ్గాచెయ్యలేదంటూ యిద్దరూ నేతలు కేకలు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*బిక్కవోలు / విశాఖపట్నం, డిసెంబర్ 23, 2020  (డి ఎన్ ఎస్):* ప్రమాణాలకు

సాక్షిభూతం గా నిలిచే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో బుధవారం రాజకీయ రగడ తారాస్థాయికి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నం ఆలయంలో అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ల మద్యం వాగ్వాదం రోడ్డెక్కింది. స్వామి ఎదుట ప్రమాణం సరిగ్గా చెయ్యలేదంటూ ఒకరి పై

ఒకరు నోరుపారేసుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరినీ శాంతపరిచడంతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయారు. అయితే మాజీ ఎమ్మెల్యే మాత్రం చాల సమయం గుళ్లోనే ఉండిపోయారు.  

ప్రస్తుత అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గత 18 నెలల కాలంలో 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అవినీతి ఆరోపణలు చెయ్యడంతో, లక్ష్మి గణపతి ఎదుట ప్రమాణం చేద్దామంటూ ఎమ్మెల్యే డా. సూర్యనారాయణ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. కుటుంబ పరంగా గణపతి ఎదుట ప్రమాణం చేద్దామని, దీనికి మాజీ ఎమ్మెల్యే ను కూడా కుటుంబ సభ్యులను తీసుకురావాలని ఛాలెంజ్ చేసారు. దీంతో ఇరు వర్గాల అనుచరగణం రోడ్డెక్కి ప్రత్యర్థుల అవినీతి కి తామే ప్రత్యక్ష

సాక్షం అంటూ మీడియా ముందుకు వచ్చారు. గత ఎమ్మెల్యే ( తెలుగుదేశం) నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి కి తామే స్వయంగా లక్షలాది రూపాయలు ముడుపులు ఇచ్చామంటూ, పైగా మద్యం దందాలు, ఇసుక దందాలు పేరుతొ కోట్లు దండుకున్నారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అనుచరులు మీడియా సాక్షిగా వివరాలు ప్రకటించడంతో ఈ వివాదం

రోడ్డెక్కింది.

ఎమ్మెల్యే కు అవినీతి పాల్పడే అవసరం లేకపోవచ్చు, కానీ అయన అనుచరులు మాత్రం భారీగానే ముడుపులకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు. 

మరో రెండు రోజుల్లో ఈ ప్రాంత సమీపంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండడంతో పోలీసులు అనపర్తి, బిక్కవోలు

ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసారు. ఈ క్రమం లో కేవలం ఇరువర్గాల నుంచి కేవలం నేతల ఇద్దరు దంపతులు మాత్రమే గుళ్లో ప్రమాణం చేసేందుకు అనుమతి ఇస్తున్నట్టు పొలిసు వర్గాలు తెలియచేస్తున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam