DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవుని ముందు మాజీ ఎమ్మెల్యే ప్రమాణం చెయ్యలేదు: అనపర్తి ఎమ్మెల్యే

*బిక్కవోలు ఆలయంలో ప్రమాణంపై అనపర్తి ఎమ్మెల్యే మండిపాటు* 

*మాజీ ఎమ్మెల్యే ఒక మానసిక రోగి:ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి* 

*సత్య ప్రమాణం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే. . .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, డిసెంబర్ 23, 2020  (డి ఎన్ ఎస్):* గత 18 నెలల

కాలంలోనే భారీ అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో నిజం లేదని బిక్కవోలు లక్ష్మి గణపతి సాక్షిగా రుజువైందని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయంలో స్వామి ఎదుట సత్య ప్రమాణం చేసిన బయటకు వచ్చిన తదుపరి మీడియాతో మాట్లాడారు. ఈ ఆరోపణలపై ఆలయంలో ప్రమాణం చెయ్యాలని సవాల్

విసిరినా నేపథ్యంలో బుధవారం బిక్కవోలు ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భారీ పోలీస్ బందోబస్త్ నేపథ్యంలో ఎమ్మెల్యే దంపతులు, మాజీ ఎమ్మెల్యే దంపతులు ఇద్దరూ ఆలయం లోకి వెళ్లారు. ఎమ్మెల్యే దంపతులు ప్రమాణం చేసిన తదుపరి, మాజీ ఎమ్మెల్యే కేవలం ఆరోపణల చిట్టా మాత్రమే చదివారు తప్ప, తానూ చేసిన ఆరోపణలు నిజం అని స్వామి ఎదుట

ఒప్పుకోలేదని, పైగా ఆయన శ్రీమతి అసలు ప్రమాణమే చేయలేదన్నారు. 

మాజీ ఎమ్మెల్యే ఒక మానసిక రోగి : . . .

మాజీ ఎమ్మెల్యే గత 15 రోజులుగా విడుదల చేస్తున్న వీడియో లను చూసిన మీదట అయన ఒక మానసిక రోగంతో బాధపడుతున్నట్టు తెలిసిందన్నారు. అతని వీడియోలను తానూ ఒక ఎమ్మెల్యేగా చూడలేదని, ఒక నిపుణుడైన వైద్యునిగా

చూసున్నారు. తక్షణం అతనికి వైద్యం అవసరం అన్నారు. ఎదుటివారు అడిగిన ప్రశ్న ఏంటో కూడా వినకుండా, కేవలం ఏకధాటిగా మాట్లాడుకుంటూ వెళ్లడం ప్రమాదకరమైన వ్యాధి అన్నారు. 

ఈ ఘటనతో అనపర్తి ప్రజలకు తన నిజాయితీ ఏంటో తెలిసిందన్నారు. గత పాలనా లో జరిగిన కార్యాచరణకు, ప్రస్తుతం పాలనకు తేడా తెలిసిందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam