DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం వైఎస్ జగన్ చే ప్రతిష్టాత్మక ఇళ్ల పట్టాలు పంపిణీ 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 25, 2020  (డి ఎన్ ఎస్):*  ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం శుక్రవారం అమితోత్సాహాల మధ్య శుక్రవారం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన కార్యక్రమంలో

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ పధకం లో  30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తోంది. ఆ స్థలంలో మహిళల పేరుతో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తారు. చాలా మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రాలేదని, జాబితాలో వారి పేర్లు లేనివారు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. అర్హత ఉన్నా కూడా ఇళ్ల పట్టాల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి 90 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపు అనేది నిరంతర ప్రక్రియ అని జగన్ స్పష్టం

చేశారు.

రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామని జగన్ తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇళ్లు కాదు, ఊళ్లు ఏర్పడతాయని జగన్ అన్నారు. ప్రస్తుతం సేకరించిన ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆ తర్వాత రెండో దశలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. 37.50 లక్షల ఇళ్ల

నిర్మాణం కోసం రూ.54,940 కోట్లు ఖర్చవుతుందన్నారు. 

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ మూడు ఆఫర్లు ఇచ్చారు.
ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే

కట్టుకోవచ్చు.
ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.
ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam