DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నందం సుబ్బయ్య హత్య ప్రభుత్వానిదే: తోట సీతారామలక్ష్మి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, డిసెంబర్ 30, 2020  (డి ఎన్ ఎస్):*  కడపజిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన నందం సుబ్బయ్య  హత్య ప్రభుత్వానిదేనని నర్సాపూర్ పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. బుధవారం జరిగిన

నియోజకవర్గ సమీక్ష సమావేశంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కడపజిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశంపార్టీ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన నందం సుబ్బయ్య  వైసీపీ ప్రభుత్వ అరాచకాలను అవినీతిని బట్టబయలు చేసిన అందుకే అంతమొందించారని ఈహత్య ముమ్మాటికి ప్రభుత్వానిదేనని ఆరోపించారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి

మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ను త్వరితగతిన నియమించాలని రాష్ట్ర పార్టీనీ  ఈ సమావేశం ద్వారా కోరుతున్నామన్నారు. సమావేశంలో వీరవాసరం మండలం భీమవరం మండలం భీమవరం పట్టణ గ్రామ వార్డ్ కమిటీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీపటిష్టం గురించి తీసుకోవాల్సిన చర్యల

గురించి చర్చించినారు. ఈసమావేశంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మేరగాని నారాయణమ్మ,భీమవరం మండల అధ్యక్షుడు బర్రె నెహ్రూ, వీరవాసరం మండలం ఇంచార్జ్ ప్రెసిడెంట్ ఎరకరాజు గోపాలకృష్ణంరాజు,ఏఎంసి మాజీ చైర్మన్  కోళ్ళ నాగేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ  చైర్మన్ మామిడిశెట్టి ప్రసాదు,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వేండ్ర

శ్రీనివాస్, గునుపూడి తిరుపాల్,ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చెల్లబోయిన సుబ్బారావు,మాజీ కౌన్సిలర్లు ఎండి అల్లావుద్దీన్ నౌషాద్, మైల బత్తుల ఐజాక్ బాబు,  బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు గంట త్రిమూర్తులు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
** నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి,

రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధిలు కరోన వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకను నిర్వహించుకోవాలని ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర వేడుకలకు  నిర్వహించడం లేదని తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam