DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చలో రామతీర్ధం ఫెయిల్యూర్ల కి కారణం ఒంటెద్దు పోకడేనా?

*బీజేపీ సహచర సంఘాలు కనుచూపులోనైనా కానరాలేదే?*   

*మొదటి రోజు విఫలం అయినప్పుడైనా. .తప్పు దిద్దుకోవాల్సింది*

*అస్త్రాలు లేకుండా ప్రత్యర్థితో పోటీకి ఎవ్వరైనా వెళ్తారా?* 

*బయటపడుతున్న బీజేపీ క్యాడర్, అభిమానుల అంతర్మధనం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , స్టాఫ్ రిపోర్టర్,

విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 10, 2020  (డి ఎన్ ఎస్):* అన్ని పార్టీలవాళ్ళూ విజయనగరం జిల్లా రామతీర్ధం గుడికి వెళ్లగలిగారు. కానీ హిందుత్వమే తన ప్రధాన అజెండా అని ప్రకటించుకునే బీజేపీ మాత్రం ఎందుకు వెళ్ళలేకపోయారు. దీనికి పూర్తిగా ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి బహిరంగమవుతోంది. కొందరు నేతలు ఇది పార్టీ అగ్ర నేతలు

 స్వయంకృతాపరాధమే అని ఆవేదన చెందుతున్నారు. కొందరు బీజేపీ నేతలు, సానుభూతిపరులు అందించిన విశ్లేషణ ప్రకారం వివరాల్లోకి వెళితే. . .     

సొంత బలం లేకపోయినా. . .

బీజేపీ కి సొంత క్యాడర్ బలం పెద్దగా లేకపోయినా. . . సహచర సంఘాలైనా సంఘ్ పరివార్ లోని ఎబివిపి, విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్, హిందూ జన జాగరణ సమితి

వంటి సంస్థల క్యాడర్ సహకారం వల్లనే కాస్తో కూస్తో బీజేపీ కి ప్రజల్లో కొంత అభిమానం ఉందన్నది వాస్తవం. 

ఈ అనుబంధ సంఘాల్లో పనిచేసే కార్యకర్తలు, నేతలు క్షేత్రస్థాయిలో ఏంతో శ్రమించి పనిచేస్తున్నందున, ఈ సందేహాలు బలోపేతంగా ఉన్నాయి. అయితే విద్యార్థినీ విద్యార్థులతో సంఘటితమైన అఖిల్ భారత్ విద్యార్థి పరిషత్

(ఎబివిపి), హిందూ ధార్మిక సంబంధిత అంశాలపై పోరాటం చేసే విశ్వ హిందూ పరిషత్ ( విహెచ్పి), మతభేదాలు లేకుండా స్వచ్చంద సేవా కార్యక్రమాలని నిరంతరం కొనసాగిస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్)లాంటి సంస్థల్లో వేలు, లక్షలాదిగా సభ్యులు అవిశ్రాంత కృషి చేస్తున్నారు. వీరందరి సహకారంతోనే భారతీయ జనతా పార్టీ

కార్యాచరణ చేస్తుంటుంది.  

ఈ సంఘాలు చేసే కార్యాచరణతోనే బీజేపీ ఈమాత్రం ఊపిరి పీల్చుకుంటోంది. అలాంటిది బీజేపీ ఏ ఉద్యమం చేపట్టాలన్నా ఈ సహచర సంఘాలన్నింటినీ ఆహ్వానించి కలుపుకుంటూ వెళ్లి నిర్వహించాల్సి ఉంటుంది. తద్వారా చేసే ఉద్యమం లో కొంతైన పురోగతి వస్తుంది. 

రాష్ట్ర కమిటీ చలో రామతీర్ధం వైఫల్యం

పై. .. 

రామతీర్ధం దురదృష్ట ఘటన పై నిరసన తెలిపేందుకు బీజేపీ ఈ నెల 5 వ తేదీన చలో రామతీర్ధం ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. వీళ్లందరినీ విశాఖలోనే హౌస్ అరెస్ట్ లు చేసారు. ఎక్కడికక్కడే నిలువరించి పూర్తిగా నీరు కార్చారు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ప్రతిష్టకు పోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,

రాష్ట్ర కార్యవర్గం రెండు రోజుల తర్వాత ఈనెల 7 న మరోసారి రాష్ట్ర స్తాయి బీజేపీ నేతలతో మరోసారి రామతీర్ధం కు పిలుపు నిచ్చారు. ఈ సారి కూడా పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేశారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి లాంటి రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఘోరంగా విఫలం చెందారు.  

బీజేపీ ఒంటెద్దు పోకడే.

.కారణమా. .. 

బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించేది ఆర్ఎస్ఎస్. దీని తరపున ఆర్గనిసింగ్ ప్రధాన కార్యదర్శిగా ఒకరు బీజేపీ రాష్ట్ర కమిటీ లో ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు చెప్పిందే బీజేపీ మొత్తం ఆచరించాల్సి ఉంటుంది. అధ్యక్షుడు కేవలం హోదా కోసమే ఉంటారన్నది పార్టీలోని వారి అభిప్రాయం కూడాను. అలంటి

ఆర్ ఎస్ ఎస్ ను గానీ, వి హెచ్ పిపి ని, గానీ, ఏ బి విపి ని గానీ, అనుబంధ ఇతర సంఘాల ప్రతినిధులు చలో రామతీర్ధం ఉద్యమం లో ఎక్కడా కనపడలేదు అన్నది ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పార్టీ నేతలు తెలియచేసిన అంశమే. 

ఈ నెల 5 వ తేదీన మొదటి చలో రామతీర్థం కు ముందు రోజున విశాఖ వచ్చిన సోము వీర్రాజు ను కలిసిన విహెచ్ పి నేతలతో

మాట్లాడేందుకు సోము వీర్రాజు ఆసక్తి చూపక పోవడం తో వారి బృందాలు ఈ ఉద్యమంలో పాల్గొనలేదని విహెచ్ పి స్థానిక నేతలు తెలియచేసారు.  అదేవిధంగా ఎబివిపి, ఆర్ ఎస్ ఎస్ సంగతి కూడా అలాగే ఉన్నట్టు సమాచారం. 
సొంతంగా బలం గానీ, క్యాడర్ గానీ ఆంధ్రా లో లేని బీజేపీ ( రాష్ట్రంలో బొత్తిగా జనం లేని పార్టీ అని ప్రతిపక్షాలు ముద్దుగా

పిలుచుకునే పేరు) కి తన శక్తి ఏంటో ఈ ఉద్యమంతో బాగా తెలిసి వచ్చి ఉంటుందని, సొంత సహాయక సంఘాల నేతలే అనుకునే స్థాయికి దిగజారిపోయిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 

మొదటి రోజు విఫలం అయినప్పుడైనా. . .

మొదటి రోజు ఉద్యమం విఫలం అయినప్పుడైనా బీజేపీ నేతలకు తమ తప్పు తెలిసివచ్చి ఉండాల్సిందని పార్టీ సానుభూతి

పరులు తెలియచేస్తున్నారు. అయినా ఒక్కరోజు విరామం లో రెండోసారి పిలుపు ఇవ్వడం అంటే ఏంతో  సాహసం తో కూడుకున్న పని. ప్రస్తుత స్థితిలో ఏ పార్టీ కూడా ఇలాంటి సాహసానికి పూనుకోవని, అలాంటిది రెండో సారి ముట్టడికి పిలుపు ఇచ్చినప్పుడైనా తన తప్పులు సరిదిద్దుకుని, సహచర సంఘ్ పరివార్ తో చర్చించి ఉంటె, పరిస్థితి మెరుగ్గా ఉండేదనే

అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇది పూర్తిగా సొంత బలం నిరూపించుకునేందుకు రాష్ట్ర కమిటీ చేసిన ప్రయత్నమనే చెప్పాలని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఈ రెండు వరుస వైఫల్యాలకు పూర్తి భాద్యత బీజేపీ రాష్ట్ర కమిటి దే అనడం ఏమాత్రం సందేహం లేదని పార్టీ సానుభూతిపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అనుమతి లేనప్పుడు

రెండోసారి ఉద్యమించడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam