DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి ఆకస్మికంగా రామతీర్థం క్షేత్ర సందర్శన

*16 నుంచి జీయర్ స్వామి రాష్ట్రవ్యాప్త ఆలయాల సందర్శన*

*కొనసాగుతున్న కట్టుదిట్టమైన భద్రతా వలయం*

*ఆలయ సిబ్బంది మినహా ఇతరులకు అనుమతిలేదు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 14, 2021  (డి ఎన్ ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయ వేదాంత ఆచార్య

పీఠాధిపతులు, వేదవిశ్వ విద్యాలయ వ్యవస్థాపకులు, త్రిదండి చిన్న జీయర్ స్వామీజీ ఉత్తరాంధ్ర అయోధ్య విజయనగరం జిల్లా రామతీర్ధం క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. మకర సంక్రాతి రోజున ఆశ్రమం లో జరపవలసిన అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుని, స్వామిజి విజయవాడ జీయర్ ఆశ్రమం నుంచి నేరుగా గురువారం మధ్యాహ్నం విశాఖ

విమానాశ్రయం కు చేరుకున్నారు. గత నెల రోజులుగా నిర్వహించిన ధనుర్మాస దీక్షను ముగించుకుని, అనంతరం స్వామిజి తమ శిష్యులు అహోబిల జీయర్ స్వామితో కలిసి రామతీర్ధం కు బయలుదేరారు. 

ఆంధ్రాలో జరుగుతున్న హిందూ ఆలయాల పై దాడుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం. ప్రస్ఫుటంగా.

కనిపిస్తోంది అని భక్తులు పడుతున్న ఆవేదన స్పందనగా ఈ నెల 16 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పర్యటన చేయనున్నారు. చిన్న జీయర్ స్వామి విగ్రహాలపై దాడులు జరిగిన సుమారు 50 ఆలయాలను ప్రత్యక్షంగా సందర్శించి, స్థానికులతో సమావేశమవనున్నారు.  

రామతీర్ధం లో జరిగిన దుర్ఘటన తెలిసిన అనంతరం తమ శిష్యులైన అహోబిల జీయర్

స్వామిని తక్షణం ఆలయానికి వెళ్లి ఘటన వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరడంతో ఘటన జరిగిన రెండవ రోజే అహోబిల జీయర్ స్వామి గత నెల 30 వ తేదీన రామతీర్ధం సందర్శించారు. 

స్వామిజి ఘటన పూర్వాపరాలను తెలుసుకుని ఆవేదనకు గురైనట్టు తెలుస్తోంది. తమ పీఠంలో నిత్యం ఆరాధనలు అందుకునేది శ్రీరామచంద్రుడి కావడం గమనార్హం. ఏంతో

వైభవం నెలకొన్న రామతీర్ధం లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టంగా అభివర్ణించనట్టు తెలుస్తోంది.  

రామతీర్థంలో ఆలయానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కేవలం దేవాదాయ శాఖా సిబ్బంది, అధికారులను మాత్రమే ఆలయంలోనికి అనుమతిస్తున్నారు. ఇతరులకు ప్రవేశం నిషేదించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల రామతీర్ధాన్ని

రాజకీయ తీర్ధం చేసిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుంచి ఆలయానికి రక్షణ కల్పించేందుకు ఈ భద్రతా అని తెలుస్తోంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam