DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనులపండువగా శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం

*చిన్నారుల నృత్య ప్రదర్శనకు సర్వత్రా ప్రశంసలు* 

*గోదావరి తీరంలో వైభవంగా శ్రీగోదా రంగనాధుల కళ్యాణం*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* గత నెలరోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ధనుర్మాసోత్సవాల్లో చివరి ఘట్టమైన శ్రీ గోదాదేవి కళ్యాణ

మహోత్సవం ను పురస్కరించుకుని చిన్నారులు ప్రదర్శించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం అందరిని ఆకట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో గత నెలరోజుల పాటు అత్యంత వైభవంగా ధనుర్మాసోత్సవాలు జరుగు తున్నాయి. ఆఖరి ఘట్టమైన శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం సందర్బంగా  శ్రీ బాల

రాజేశ్వరి ఆలయ గురు స్వామి హేమాద్రి బద్రీనాథ్ శిష్యులు ఈ రూపకం ప్రదర్శించారు. ఈ రూపకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో సిహెచ్. వైష్ణవి, (మిర్తిపాటి పూర్ణ ప్రకాష్ మనవరాలు ),  అలివేలు మంగ పాత్రలో ఓజిస్మిత ప్రధాన భూమిక వచించారు. ఇతర పాత్రల్లో చిన్నారులు అందరిని ఆకట్టుకున్నారు. ప్రధానంగా తాళ్ళపాక అన్నమాచార్యుల

కీర్తనలతో రూపొందించిన ఈ రూపకం లో పాత్రలను కళ్ళ ఎదుట స్ఫురించే విధంగా వస్త్రధారణ, అలంకరణ, చిన్నారుల అభినయం హృద్యంగా అనిపించింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam