DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్భుతం, అమోఘం ఏకాదశ రుద్రుల ప్రభల తీర్ధం 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో సంక్రాంత్రి పర్వదినోత్సవం మరునాడు వచ్చే కనుమ రోజున జగ్గన్న తోటలో మహా వైభవంగా ప్రభల తీర్ధం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాక, ఇతర రాష్ట్రాల

నుంచి సైతం హాజరవుతుంటారు. శుక్రవారం జరిగిన ప్రభల తీర్ధం లో భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. ఈ ఉత్సవం అత్యంత ప్రసిద్ధ, చారిత్రక మరియు పురాతన పండుగలలో ఒకటి. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలోని అంబాజిపేట మండలంలోని మొసలపల్లి గ్రామంలో జగ్గన్నథోట ఒక చిన్న కుగ్రామం, ఎపి జగ్గన్నతోటను ఏకాదశ రుద్రుల

స్థానం ( శివుని 11 రూపాలు) అని పిలుస్తారు. జగ్గన్నాథోట కొబ్బరి చెట్లతో నిండిన కొబ్బరి తోట. కోనసీమ లోని వివిధ గ్రామాల నుంచి 11 మంది రుద్రులను ఒకే వేదిక కు తీసుకువచ్చి కనుల పండువగా 
ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.  

ఈ ఉత్సవం లో పాల్గొనేందుకు రుద్రులు ఒక భారీ ఆకారంలో ఉన్న వేదికపై ఆసీనులై ఉంటారు. దీన్నే ప్రభ

అని పిలుస్తారు. ఒక్కొక్క ప్రభ చాలా బరువు ఉంటుంది. ఎక్కువమంది భక్తులు స్వయంగా మోస్తూ, కాలువలు దాటుతూ మరీ జగ్గన్న తోటకు చేరుకుంటారు.   
ఈ ప్రభల తీర్ధం లో పాల్గొనే గ్రామాల ప్రతినిధులు ఇవే. 

శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం, 
శ్రీ మేనకేశ్వర స్వామి, కె. పెదపూడి,  
శ్రీ ఆనంద రామేశ్వర స్వామి,

ఇరుసుమంద,  
శ్రీ విశ్వేశ్వర స్వామి, వక్కలంక,  
శ్రీ చెన్న మల్లేశ్వర  స్వామి, నేదునూరు,  
శ్రీ రాఘవేశ్వర స్వామి, ముక్కామల,  
శ్రీ భోగేశ్వర స్వామి, మోసలపల్లి,  
శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, పాలగుమ్మి,  
శ్రీ వీరేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహరం,  
శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకూరు,  
శ్రీ

అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, పుల్లెటికుర్రు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam