DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైందవ ధర్మ పరిరక్షణ కై కదిలివచ్చిన అపర రామానుజులు

*దేవాలయాల రక్షణకై చిన్న జీయర్ స్వామి రాష్ట్ర పర్యటన* 

*విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల పునురుద్ధరణకై కృషి*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*కర్నూలు / విశాఖపట్నం, జనవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* హిందూ దేవాలయాలతో పాటు, ధార్మిక సంప్రదాయ పరి రక్షణ లో ప్రతి ఒక్కరూ భాద్యత

వహించాలని, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర భగవద్రామానుజులు, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవీదేవతలు విగ్రహాల ధ్వంసం ద్వారా నిస్సహాయ స్థితిలో ఉన్న హిందూ సమాజాన్ని చైతన్యపరిచేందుకు స్వామిజి చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆలయాల

సందర్శన యజ్ఞం లో భాగంగా ఆదివారం స్వామిజి బృందం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. దీనిలో భాగంగా స్వామిజి ఆదివారం కర్నూలు జిల్లా మంత్రాలయంలో పర్యటించారు. 

ఈ సందర్బంగా స్వామిజి దేవాలయాల్లోని దేవీదేవతలు విగ్రహాల పై జరుగుతున్న దాడుల పట్ల స్వామిజి తీవ్ర

అసహనాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేకంగా దేవాదాయ శాఖా ఉందని, అయితే ఆ శాఖా తన భాద్యతలను పూర్తిగా విస్మరించినట్టుగా ఈ ఘటనలు తెలియచేస్తున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.  

అనంతరం పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో  దేవాలయాలపై దాడులు జరిగిన ప్రదేశాలను ను  సందర్శించడం లో

భాగంగా  మంత్రాలయం కు విచ్చేశారు. అనంతరం శ్రీ నగరును నరసింహ (నర్సప్ప) ఆలయం, నొసగి లోని మర్లబండ ఆంజనేయస్వామి ఆలయం, తదుపరి పెద్దతుంబళం లోని పురాతన శ్రీరామచంద్రుని ఆలయం, ఆదోని లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించారు. స్థానికులు, ఆలయ సిబ్బందిని అడిగి అక్కడ జరిగిన ఘటనలను తెలుసుకున్నారు.   

అంతకు ముందు

శ్రీ మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్ధ స్వామిజీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మఠం సంప్రదాయాల ప్రకారం, వేదమంత్రోఛ్చారణతో, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ మాంచాలమ్మ దేవిని  దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు స్వామిజి

రాఘవేంద్రుల శేష వస్త్రం జీయర్ కి సమర్పించారు.

చిన్న జీయర్ స్వామి వెంట త్రిదండి అహోబిల జీయర్ స్వామి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam