DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీ తల్లిని పూజించు, ప్రక్క వారి తల్లిని గౌరవించు: చిన్న జీయర్ స్వామి 

*పరమతసహనం పై చిన్న జీయర్ స్వామి స్పష్టికరణ* 

*కర్నూలు జిల్లాలో జీయర్ స్వామి ధర్మ పరిరక్షణ చైతన్య యాత్ర * 

*కర్ణాటక నుంచి సైతం యాత్రలో అర్చక బృందాలు *

*(DNS రిపోర్ట్ : ముడుంబై విజయకుమార్, స్వామిజి యాత్ర స్థలం)*  

*కర్నూలు / విశాఖపట్నం, జనవరి 18, 2021  (డి ఎన్ ఎస్):* నీ తల్లి లాంటి హిందూ

ధర్మాన్ని, మత సంప్రదాయాన్ని నువ్వు పూజించాలని, పక్కింటి తల్లి లాంటి ఇతర సంప్రదాయాలను గౌరవించాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర భగవద్రామానుజులు, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలియచేసారు. సోమవారం ఉదయం ఆదోని పట్టణం లోని ఆలయాలను సందర్శిస్తున్న ఆయన హిందూ ధార్మిక

సంఘాలు, యువతీయువకులకు, సామాజిక వర్గాల ప్రతినిధులకు పలు సూచనలు చేసారు.  

ఈ సందర్బంగా పరమత సహనము గురించి చిన్న జీయర్ స్వామి సంపూర్ణ వివరణ ఇచ్చారు. నీ తల్లిని పూజించకుండా, పక్కింటి ఆవిడను నీ తల్లిలా నువ్వు పూజిస్తే నీ తల్లిని నువ్వు అవమానించడమే అవ్వుతుందన్నారు. అలాగే, నువ్వు ఆచరించవలసిన హిందూ

సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కి, నీకు తెలియని, ఇతరుల మెప్పుకోసం నీకు అర్ధంకాని ఇతర సంప్రదాయ అలవాట్లను పాటించడం అంటే నీ హిందూ ధర్మాన్ని కించపరచడమేనన్నారు.     

సెక్యులర్ అంటే నువ్వు పాటించవలసిన హిందూ ధర్మాన్ని వదిలేసి, ప్రక్కవాళ్ళను అందలం ఎక్కించడం కాదని, నీ ధర్మం నువ్వు కచ్చితంగా పాటించాలన్నారు. ఇతర

ధర్మాలను గౌరవించడం అంటే. . వాళ్ళ సిద్దాంతాలు నువ్వు పాటించడం కాదన్నారు. ఎవరిని కించపరచకూడదని సూచించారు. 

హిందూ దేవాలయాలతో పాటు, ధార్మిక సంప్రదాయ పరి రక్షణ లో ప్రతి ఒక్కరూ భాద్యత వహించాలనే సంకల్పంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, అపర భగవద్రామానుజులు, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, త్రిదండి చిన్న

శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేపట్టిన హైందవ ధర్మ పరిరక్షణ చైతన్య యాత్ర మూడవ రోజు కూడా కర్నూలు జిల్లాలో సాగుతోంది. 

ఈ నెల 16 న ప్రారంభమైన ఈ పర్యటన యజ్ఞం మూడవరోజైన సోమవారం ఉదయం ఆదోని పట్టణం లోని వివిధ సామజిక వర్గాల ప్రతినిధులు, హిందూ భక్త బృందాలతోను ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, హైందవ ధర్మ

పరిరక్షణకై చేపట్టవలసిన కార్యాచరణను వివరించారు. అనంతరం పత్తికొండ మండలం లోని దేవనబండ గ్రామంలోని హరిజనవాడలో గల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. 

మొదటి రోజు మంత్రాలయం చేరుకున్న స్వామిజి రెండవరోజు మంత్రాలయ శ్రీరాఘవేంద్ర స్వామి బృందావనం నుంచి యాత్రను కొనసాగించారు.  మధ్యాహ్నం పెద్ద తుంబలం

లోని పురాతన శ్రీరామలయాన్ని, పరిసర గ్రామాల్లోని ఆలయాలను సందర్శించి, రాత్రి ఆదోని గ్రామానికి చేరుకున్నారు. స్థానిక భక్తులతోనూ, ఆలయాల ప్రతినిధులతోను సమావేశం నిర్వహించి, వారికీ మార్గదర్శకం చేసారు. 

కర్ణాటక నుంచి సైతం యాత్రలో అర్చక బృందాలు : 

కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి క్షేత్రం లో గల

శ్రీరామచంద్ర స్వామి ఆలయ అర్చకులు ముడుంబై విజకుమారాచార్యులు హిందూ ధర్మ పరిరక్షణ యాత్రలో స్వామిజి తో పాటు పాల్గొంటున్నారు. ఎంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఆదోనికి వచ్చి జీయర్ స్వామి ఆలయాల సందర్శన యజ్ఞం లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఆయా ఆలయాలలో జరిగిన ఘటనలను తెలుసుకుంటూ, స్వామిజి పర్యటన యాత్ర విశేషాలను, ఆయా

క్షేత్రాల ప్రాశస్త్యాన్ని ఇతర ప్రాంతాల భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam