DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయసాయి పై దాడి కేసులో టీడీపీ నేత కళా వెంకటరావు అరెస్ట్ 

*హై డ్రామా మధ్య చీపురుపల్లి పీఎస్ కు వెంకటరావు తరలింపు* 

*కేసు నమోదైన నెల్లిమర్ల పీఎస్ కాకుండా చీపురు పల్లి కి తరలింపు* 

*మండిపడ్డ చంద్రబాబు, లోకేష్, పార్టీ నేతలు.* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, జనవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* ఉత్తరాంధ్ర

అయోధ్య విజయనగరం జిల్లా లోని రామతీర్థంలో గుడివద్ద ఈ నెల 2 న ఎంపీ విజయ సాయి రెడ్డి కారు పై చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ను అరెస్ట్ చేసారు. బుధవారం రాజాం లోని ఆయన ఇంట్లో / క్యాంప్ కార్యాలయంలో భోజన సమయంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రాజాం తన

నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు పోలీసులు సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఆయన నివాసం వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని వెళ్లట్లేదు నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్టు చేశారు.  అయితే కేసు నమోదైన నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ కు కాకుండా చీపురుపల్లి

పీఎస్ కు తరలించడం గమనార్హం. కేసు నెల్లిమర్ల పీఎస్ లో నమోదు కావడంతో మీడియా, పార్టీ కార్యకర్తలు అంతా నెల్లిమర్ల వెళ్తుండడంతో, పొలిసులు కళను చీపురుపల్లికి తరలించారు. 

ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం: చంద్రబాబు 

కళా వెంకటరావు లాంటి సౌమ్యులని రాత్రి పుట అరెస్టు చేసిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు

వైఖరి చూస్తే ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనంగా నిలిచిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కళా వెంకట రావు వంటి సీనియర్ రాజకీయ నాయకుడిని ఒక కరడు కట్టిన నేరస్తుణ్ణి అరెస్ట్ చేసినట్టుగా తీసుకువెళ్లడం దారుణమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని వైఎస్ జగన్ ప్రభుత్వం పోలీసులను

అడ్డుపెట్టుకుని కక్ష సాదిస్తోందన్నారు. 

ఇది చేతగాని ప్రభుతం : లోకేష్ 

రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హం త‌ల ఎత్తుకెళ్లిన వారిని ప‌ట్టుకోలేక‌పోయిన చేత‌కాని స‌ర్కారు, అత్యంత సౌమ్యుడైన బీసీ నేత‌ టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు కిమిడి క‌ళావెంక‌ట‌రావు ను అక్ర‌మంగా రాత్రిపూట అరెస్ట్

చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 

ముందు విజయసాయి ని అరెస్టు చెయ్యాలి: జవహర్ 

ఈ ఘటనకు ప్రధాన కారకుడు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చెయ్యాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేసారు. రామతీర్ధం పర్యటనకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కు

అనుమతిచ్చిన పోలీసులు అదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. దీనికి కారణమైన పోలీసులదే తప్పన్నారు. నాడు ప్రజల్ని  రెచ్చగొట్టడానికి రామతీర్థం విజయ సాయి వచ్చారన్నారు. మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టు ఖండిస్తున్నామన్నారు. 

కళా అరెస్ట్ జగన్ రెడ్డి రాక్షసత్వానికి నిదర్శనం: .

కళా వెంకట్రావు గారి అరెస్ట్ జగన్ రెడ్డి రాక్షసత్వానికి నిదర్శనమని, తక్షణమే ఆయనను విడుదల చేయాలని అమర్ నాథ్ రెడ్డి డిమాండ్ చేసారు. దేవాలయాల దాడులపై తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే అరెస్ట్ చేశారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam