DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సజీవ దహనం కాకుండా ముగ్గురికి ప్రాణదానం చేసిన ధీశాలి అమిత్ రాజ్

మానవత్వం మెండుగా ఉన్న మహోన్నతుడు 15 ఏళ్ళ అమిత్ రాజ్

ఈ  ధైర్యశాలి బీహార్ లోని పురూలియా సైనిక్ స్కూల్ విద్యార్థి 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 22, 2021  (డి ఎన్ ఎస్):* వెండితెరపై గ్రాఫిక్ లతో స్టెంట్ లు చేసే సినిమా నటులను నీరాజనాలు పెట్టె

ప్రజానీకానికి తమ తో పాటే ఉండే ధైర్యశాలురైన యువతను అస్సలు ఖాతరే చెయ్యరు. అయితే అలాంటి యువతే దేశం మెచ్చదగిన ధైర్యసాహసలెన్నింటినో ప్రదర్శిస్తుంటారు. ఆ కోవకే చెందిన ఈ 15 ఏళ్ళ యువకుడు అమిత్ రాజ్. ఈ బాలుడు చూపిన మానవతావాదం, ధైర్య సాహసాలకు యావత్ సమాజం నీరాజనాలు పడుతోంది. అయితే వాటిని నేరుగా అందుకునే అవకాశం లేకుండా

పోయింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ధీశాలి చరిత్ర వివరాల్లోకి వెళితే. . .   

డిసెంబర్ 3 వ తేదీ, 2020 న, సైనిక్ స్కూల్ పురులియాకు చెందిన క్యాడెట్ అమిత్ రాజ్, బీహార్‌లోని తన స్వస్థలమైన నలందాలో ఉదయం 6 గంటలకు జాగింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ప్రజలు అరవడం విన్నాడు. ఒక పొరుగు ఇంటిలో మంటలు చెలరేగడం చూసి అతను బయటికి

వచ్చాడు. లోపల చిక్కుకున్న ముగ్గురు పిల్లలను రక్షించడానికి మరో ఆలోచన లేకుండా రెండుసార్లు ఇంట్లోకి ప్రవేశించాడు. మొదటి ఇద్దరు పిల్లలను రక్షించే సమయానికి అతను 85% కాలిన గాయాలతో బయటికి వచ్చాడు, అయినా సరే మూడవ బిడ్డను రక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను మూడవ బిడ్డను కాపాడే స్థితిలో లేడు, కాని కాలిన గాయాలను

స్వీకరిస్తూనే మూడవ బిడ్డను కాపాడటానికి ఇంట్లోకి ప్రవేశించాడు. అతని వీరోచితం వల్ల ముగ్గురు పిల్లలు రక్షించబడ్డారు. అప్పటికే అతని శరీరం 95 శాతం గాయాలతో నిండిపోయింది. సమీపంలోని ఆసుపత్రిలో చేరిన అతన్ని తరువాత ఢిల్లీలోని సఫదర్‌జాంగ్ ఆసుపత్రికి తరలించారు. 13 డిసెంబర్ 2020 న ఆ ధైర్యవంతుడు ప్రాణాలు

కోల్పోయాడు. 

ఈ ఘటన జరిగి సుమారు నెల రోజులు దాటినా మీడియా ల్లో ఈ వీరుని త్యాగాన్ని ప్రసారం చెయ్యక పోవడం బాధాకరం. ఇలాంటి త్యాగధనుల గురించి ప్రపంచానికి తెలియచేయాల్సిన భాద్యత ఉన్న మీడియా రంగం సైతం దృష్టి పెట్టకపోవడం బాధాకరం.  వెండి తెరల తారల వేష భాషలపై మీడియా చూపిస్తున్న అత్యుత్సాహం లో ఇలాంటి వీరుల

చరిత్రలు కనుమరుగైపోయాయి. 

ప్రత్యేక కృతజ్ఞతలు : ఈ ధైర్య శాలి త్యాగాన్ని సోషల్ మీడియా ద్వారా మా DNS సంస్థకు అందించిన Sai Kumar Divate , Sreekar Reddy లకు ప్రత్యేక కృతఙ్ఞతలు  తెలియచేస్తున్నాం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam