DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా బాలిక సాహితి కి జాతీయ జీవన్ రక్షా పురస్కారం

*Prez Kovind confers Jeevan Raksha Padhak 2020 awards* 

*జీవన్‌ రక్ష పదక్‌ 2020 పురస్కారాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోదం*

విశాఖ జిల్లా బాలిక కలగర్ల సాహితి కి జీవన్ రక్షా పురస్కారం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* అత్యుత్తమ మానవతను చాటుతూ ఇతరుల

ప్రాణాలను కాపాడిన 40 మందికి భారత రాష్ట్రపతి రామ్ నద్దకోవింద్ జీవన్‌ రక్ష పతక్‌ అవార్డులను అందించేందుకు ఆమోదం తెలిపారు. వీరిలో సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌ను ఒకరు, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌ను 8 మంది, జీవన్‌ రక్ష పదక్‌ను 31 మంది అందుకోనున్నారు. వీరిలో ఒకరికి మరణాంతరం పురస్కారాన్ని ప్రకటించారు. వీరిలో ఆంధ్ర

ప్రదేశ్ నుంచి కేవలం ఒక్క బాలికకు పురస్కారం లభించింది. 

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలానికి చెందిన కలగర్ల సాహితి, ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌ లభించింది. 

విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం, లోని కొత్తకోట గ్రామానికి చెందిన కలగర్ల సాహితి కి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జీవన

రక్షా పథక్ 2020 పురస్కారం లభించనుంది. 

ఈమె చేసిన సాహసం ద్వారా పిల్లలను సముద్రం లో మునిగిపోకుండా కాపాడింది. ఎస్ రాయవరం మండలం లోని రేవు పోలవరం సముద్ర బీచ్ కు 2018 నవంబర్ 4 వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర ప్రాంతానికి పిక్ నిక్ కు వెళ్ళింది. ఆ సమయంలో 20 మంది స్కూల్ పిల్లలు సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో

తిరుమలేశు (6 ఏళ్ళు ), భార్గవి (8 ఏళ్ళు ) లు సముద్రం లోకి కొట్టుకు పోయారు. వారిద్దరినీ చూసిన సాహితి, వెంటనే సముద్రంలోకి వెళ్లి వాళ్ళిద్దరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. తిరుమలేశుని వీపు మీద కూర్చోబెట్టుకుని, భార్గవిని ముందుకు తోసుకుంటూ ఒడ్డుకు చేరుచినట్టు సాహితి తెలియచేసింది. 

విద్యా మేధావి కూడానూ. .

.

సాహితి సాహసం లోనే కాక విద్యాపరమైన అంశాల్లో సైతం అద్భుతంగా రాణిస్తోంది. లాస్ ఏంజెల్స్ లో నాసా వారు విద్యార్థులకు నిర్వహించిన సైన్సు పోటీల్లో వజ్ర కవచం ప్రాజెక్ట్ ను ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంది. 


పురస్కార గ్రహీతల వివరాలు:  


సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌:

ముహమ్మద్‌ హుష్రీన్‌ (మరణాంతరం), కేరళ

ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌: 
1 .  రామ్‌షీభాయ్ రత్నాభాయ్ సమద్ (రబారి), గుజరాత్
2 . పరమేశ్వర్ బాలాజీ నగర్‌గోజే, మహారాష్ట్ర
3 . అమన్‌దీప్ కౌర్, పంజాబ్
4 . కోరిపెల్లి సృజన్ రెడ్డి, తెలంగాణ
5 . టింకు నిషాద్, ఉత్తరప్రదేశ్
6 . హిమాని బిస్వాల్, మధ్యప్రదేశ్
7 .

కలగర్ల సాహితి, ఆంధ్రప్రదేశ్
8 . భువనేశ్వర్ ప్రజాపతి, ఉత్తరప్రదేశ్

జీవన్‌ రక్ష పదక్‌:
1 . భవేష్‌కుమార్ సాతూజీ విహోల్, గుజరాత్
2 . ఈశ్వర్‌లాల్‌ మనుభాయ్ సంగడ, గుజరాత్
3 . మన్మోహన్‌సింహ్‌ రాథోడ్, గుజరాత్
4 . ప్రకాష్‌కుమార్ భావ్‌చంద్‌భాయ్ వెకారియా, గుజరాత్
5 . రహ్వీర్ వీరభద్రసింహ్ తేజ్

సింహ్‌, గుజరాత్
6 . రాకేశ్‌భాయ్ బాబూభాయ్ జాదవ్, గుజరాత్
7 . విజయ్ అజిత్ చైరా, గుజరాత్
8 . మాస్టర్ అరుణ్ థామస్, కేరళ
9 . రోజిన్ రాబర్ట్, కేరళ
10. షిజు.పి.గోపి, కేరళ
11. గౌరీశంకర్ వ్యాస్, మధ్యప్రదేశ్
12. జగదీష్ సింగ్ సిద్ధు, మధ్యప్రదేశ్
13. పుష్పేంద్ర సింగ్ రావత్, మధ్యప్రదేశ్
14. రాజేష్ కుమార్ రాజ్‌పుత్,

మధ్యప్రదేశ్
15. అనిల్ దశరథ్‌ ఖులే, మహారాష్ట్ర
16. బాలాసాహెబ్ ద్యాందియో నగర్‌గోజే, మహారాష్ట్ర
17. సునీల్ కుమార్, ఉత్తర ప్రదేశ్
18. మోహిందర్ సింగ్, పంజాబ్
19. నిహాల్ సింగ్, ఉత్తరప్రదేశ్
20. ఫెడ్రిక్, అండమాన్&నికోబార్
21. ముఖేష్ చౌదరి, రాజస్థాన్
22. రవీంద్ర కుమార్, గుజరాత్
23. ఎస్. ఎం.రఫి, కర్ణాటక
24. ఎస్.వి.జోస్,

కేరళ
25. వాణి హిరెన్ కుమార్, గుజరాత్
26. అబుజాం రాబెన్ సింగ్, మణిపూర్
27. బాలానాయక్ బాణావత్, కేరళ
28. అశోక్ సింగ్ రాజ్‌పుత్, జమ్ముకశ్మీర్
29. పరంజిత్ సింగ్, జమ్ముకుశ్మీర్
30. రంజిత్ చంద్ర ఇషోర్, జమ్ముకశ్మీర్
31. రింకు చౌహాన్, ఉత్తరప్రదేశ్

మానవ చర్య ద్వారా తోటివారి ప్రాణాలను కాపాడినవారికి గుర్తింపుగా

జీవన్‌ రక్ష పదక్‌ సిరీస్‌ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పదక్‌, జీవన్‌ రక్ష పదక్‌ విభాగాల్లో వీటిని ప్రదానం చేస్తారు. అన్ని వర్గాలవారు వీటికి అర్హులే. వ్యక్తుల మరణాంతరం కూడా అందజేస్తారు.

ఒక పతకం, కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన

ధృవపత్రం, కొంత నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు/సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత సమయంలో అవార్డుగ్రహీతలకు అందజేస్తాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam