DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడిన గణతంత్ర వేడుకలు

*ఆంధ్ర నుంచి లేపాక్షి, యుపి నుంచి అయోధ్య మందిరాలు* 

*కొవిడ్ ప్రభావంతో అత్యంత కుదించిన వేడుకలు, కొన్ని రద్దు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, )*  

*ఢిల్లీ / విశాఖపట్నం, జనవరి 26, 2021  (డి ఎన్ ఎస్):*దేశ రాజధానిలో మంగళవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక

వాతావరణంలో ఓలలాడాయి. ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల ప్రతీకలుగా వచ్చిన శకటాల ప్రదర్శనలో ఈ ఏడాది 17 రాష్ట్రాల నుంచి ప్రదర్శించిన శకటాలు ఆయా రాష్ట్రాల్లోని దేవాలయాలను ప్రదర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి అనంతపురం జిల్లాలోని లేపాక్షి లోగల విరూపాక్ష దేవాలయ నమూనాను ప్రదర్శించారు. భారీ ఎత్తులో ఉన్న నంది అత్యంత ఆకర్షణగా

నిలిచింది. ఆలయం లో ఉన్న కళా చరిత్ర, వాస్తు కళ వైభవాన్ని దేశప్రజలకు వివరించారు. 

కోట్లాది మంది హిందువుల చిరకాల మనోవాంఛ అయోధ్య లో శ్రీరామ మందిర నిర్మాణం సాకారమవుతున్న సందర్బంగా ఉత్తర ప్రదేశ్ నుంచి అయోధ్య శ్రీరాముని భవ్య మందిర నిర్మాణం శకటం ప్రదర్శించారు. రామాయణ గ్రంథ కర్త వాల్మీకి మహర్షి భారీ విగ్రహం

అందరిని ఆకట్టుకుంది.  

అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రదర్శించిన శకటాల్లో 

మొట్టమొదటి సారిగా జమ్మూ కాశ్మీర్ ప్రతినిధిగా లడక్ నుంచి స్వచ్ఛమైన విజన్,      
గుజరాత్ నుంచి మెహసానా జిల్లా లోని మొధేరా సూర్య దేవాలయం, 
అస్సాం నుంచి టీ తోటలు, పెంపకం, 
తమిళ నాడు తరపున పల్లవ రాజ్య చరిత్రను

తెలిపే మహాబలిపురం దేవాలయం, 
మహారాష్ట్ర నుంచి భక్తి ఉద్యమం - పండరీపురం, మీరా తదితర భక్తులు,  
కేదార్నాద్ నుంచి దేవభూమి లో ఉండే దేవీ దేవతలు,  
ఛత్తీస్ ఘర్ నుంచి సాంస్కృతిక ఉద్యమం 
గురు తేజ్ బహదూర్ 400 వ జయంతి వేడుకలను పురస్కరించి సిక్కు ప్రార్ధన వైభవం, 
త్రిపుర నుంచి కాలుష్య రహిత ఉత్పత్తుల తయారీ,

ఆత్మనిర్భర భారత్   
పశ్చిమ బెంగాల్ నుంచి సాబూజ్ సాథీ, మహిళా వైభవం, 
సిక్కిం నుంచి సంప్రదాయ వేడుకలు పంగ్ లబ్సోల్, 
ఉత్తర ప్రదేశ్ నుంచి సాంస్కృతిక ఉద్యమం,  
ఢిల్లీ నుంచి పునర్వైభవం అభివృద్ధి 
కర్ణాటక నుంచి హంపి విజయనగర వైభవం, 
కేరళ నుంచి కొబ్బరి ఉత్పత్తులు 
అరుణాచల ప్రదేశ్ నుంచి తూర్పు,

పశ్చిమ సమ్మిళితం.
ప్రదర్శించారు. 

ప్రస్తుతం కొవిడ్ ప్రభావం ఇంకా కొనసాగుతుండడం తో గణతంత్ర వేడుకలను కుదించడం జరిగింది. ఆరోగ్య భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా వివిధ రాష్ట్రాల శకటాలను తగ్గించడం, కేవలం అతి కొద్దీ మంది కి మాత్రమే అనుమతి కి ప్రవేశం కల్పించడం, ధైర్య సాహసాలు ప్రదర్శించిన సాహస బాలల, స్కూల్ పిల్లల

పెరేడ్ లు తగ్గించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam