DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకగ్రీవాల కోసం ట్రై చేసే వారిపై సుమోటోగా కేసులు పెట్టాలి 

*స్థానిక ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరగాలి* 

*జగన్ పుణ్యంవల్ల గతంలో ఐఎఎస్ లు  జైలుకెళ్లారు, మళ్ళీ అలాగే*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్,)*  

*విజయవాడ / విశాఖపట్నం, జనవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరగాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ

సోము వీర్రాజు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు తెలిపారు. బుధవారం విజయవాడ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ అధికార పార్టీ వైఖరి పై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోను

పోటీ చేయాలని, ముఖ్యంగా యువతకు పెద్దపీట వేయాలని ఉభయ పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా  స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. 

బుధవారం ఉదయం విజయవాడ సూర్యారావుపేటలోని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ, జనసేన పార్టీల కృష్ణా,

గుంటూరు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మనోహర్ గారు మాట్లాడుతూ 
“రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, అందరికోసం పని చేయాల్సిన ముఖ్యమంత్రి కొన్ని వర్గాలకే పరిమితమై, నియంతలా పాలించాలని చేస్తున్న ప్రయత్నాన్ని అందరం కలిసి అడ్డుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో

ఎక్కువ ఏకగ్రీవాలు జరగాలంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఏదో కుట్ర దాగి ఉందన్నారు. ఏకగ్రీవాల కోసం ట్రై చేసే వారిపై సుమోటోగా కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు. ఈ నెల 29వ తేదీన గవర్నర్ గారిని కలిసి ఈ అంశాలపై వినతిపత్రం సమర్పిస్తాం అన్నారు. 

ఢిల్లీ ఘటన కలచి వేసింది: . .. 

గణతంత్ర దినోత్సవం

సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను జనసేన పార్టీ ఖండిస్తోంది. రైతుల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడంతోనే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిని ముక్తకంఠంతో అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. రైతుల మేలు కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కొన్ని శక్తులు

అడ్డుకుంటున్నాయ”న్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam