DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకగ్రీవాల ప్రకటనల పై పార్టీలు అభ్యంతరం, ఎస్ఈసి సీరియస్

*ఏపీ సమాచార శాఖ కమిషనర్ కు ఎస్ఈసి మెమో జారీ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* ఏకగ్రీవాలు ఇంతకుముందు జరిగాయని, ఇకపై కూడా జరుగుతాయని ఎస్ఈసీ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ఏకగ్రీవం చెయ్యాలంటూ ప్రభుత్వం నేరుగా

ప్రకటనలు ఇవ్వడం, ప్రోత్సహించడం పట్ల కొన్ని పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. 

ఎన్నికల నిర్వహణ నేపధ్యం లో ఉదయం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలవడం జరిగిందని, ప్రభుత్వానికి, ఎస్ఈసీకి వారదిగా ఉంటానని గవర్నర్ హరిచందన్ హామీ ఇచ్చినట్లు రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన

అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగుల పాత్రపై గవర్నర్ నిర్మాణాత్మక సూచనలు చేశారన్నారు. ఆ సూచనలను పాజిటివ్ దృక్పథంతో స్వీకరించి ఎన్నికలను విజయవంతం చేయాలని భావిస్తున్నామని రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. 

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రధాన కార్యదర్శి

ఆదిత్యానాథ్ దాస్‌ లతో వ్యక్తిగతంగా నాకు మంచి సంబంధాలున్నాయని, వారిని సస్పెండ్ చేస్తానని చెప్పలేదన్నారు. కేవలం అభిశంసన మాత్రమే చేసినట్టు తెలిపారు. వారి ప్రతిష్టను ఇనుమడింపజేశానన్నారు. ఉద్యోగ సంఘాలు నాపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను. నేను కూడా ఉద్యోగినే. నాకు ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావం లేదు. నేను కక్ష సాధింపు

చర్యలేమీ చేయలేదన్నారు. ప్రభుత్వంపై నా మనసులో ఎలాంటి కక్ష లేదు.ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తోంది. కోడ్ ఆప్ కండక్ట్ విషయంలో ప్రభుత్వం పెద్దలు సంయమనం పాటించాలి.’’ అని అన్నారు.

సమాచార శాఖ కమిషనర్ కు ఈసీ అర్జెంటు మెమో జారీ:. . 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు లో

ఉన్న సమయంలో వివిధ పత్రికల్లో పంచాయితీ ఎన్నికలను ఏకగ్రీవం చెయ్యాలంటూ ప్రధాన పేజీల్లో ప్రకటనలు ఇవ్వడం పై సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కు ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్జెంటు మెమో జారీ చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కమిషన్ కు తెలియకుండా పత్రికలూ, టీవీలకు ప్రకటనలు ఇవ్వరాదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam