DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీరేశలింగం స్మారక అవార్డు కు సిఎస్ఎన్ రాజు 5 లక్షల విరాళం 

*యువత కు కందుకూరి వైభవం తెలిపేందుకే: సి ఎస్ ఎన్ రాజు.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 28, 2021  (డి ఎన్ ఎస్):* ఆధునిక సమాజంలో ఎన్నో సంఘ సంస్కరణలు చేపట్టిన ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేస్తూ, నిర్వహణకు రూ. 5 లక్షల

నగదును దార్శనికులు, విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ( కళాభారతి ) వ్యవస్థాపక అధ్యక్షులు సి ఎస్ ఎన్ రాజు విరాళాన్ని అందించారు. గురువారం కళాభారతి సంస్థ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు) అందించిన వివరాల ప్రకారం, కందుకూరి ఈ సమాజానికి, ప్రధానంగా మహిళా సమాజానికి చేసిన సేవలను ఆధునిక, వర్ధమాన తరాలకు తెలియచేయాలని

సంకల్పంతో సి ఎస్ ఎన్ రాజు ఈ విరాళాన్ని అందించారన్నారు. ఈ మొత్తాన్ని ఒక జాతీయ బ్యాంక్ లో నిక్షిప్తం చేసి, దానిపై వచ్చే వడ్డీ తో ప్రతి ఏడాది ఒక సాహితీవేత్త ను కందుకూరి వీరేశలింగం పంతులు ఎండోమెంట్ ఫండ్ అవార్డు సత్కరించడం జరుగుతుందన్నారు. గత 30 ఏళ్లుగా సి ఎస్ ఎన్ రాజు, సాంస్కృతిక, సంగీత, కళారంగాలకు ఎంతో సేవచేశారన్నారు.

ప్రస్తుతం సాహిత్యరంగానికి సేవలు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. 

కందుకూరి. . మార్గదర్శి :. . .

తెలుగు సంస్కృతీ, భాష సంప్రదాయాలతో ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా పరిచయం చెయ్యవలసిన అవసరం లేని పేరు కందుకూరి విరేశలింగం పంతులు. గోదావరి తీర రాజమహేంద్రవరం లో 1848 - 1919 కాలం మధ్య జీవించారు. కడు పేద కుటుంబంలో

పుట్టి, మెట్రికులేషను పూర్తి చేసి బడిపంతులుగా స్థిరపడ్డారు. 

ఆస్తి మొత్తం సమాజానికే విరాళం:

 కోట్లాది గా విలువ చేసే స్థిరాస్తులను కందుకూరి సమాజానికే రాసి ఇచ్చేసారు. ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ అభ్యసించే విధంగా విద్యాసంస్థలను రాజమహేంద్రవరంలోనే  నెలకొల్పారు. ఆయన కు గౌరవార్ధం

కోటిపల్లి బస్టాండ్ కూడలి లో అయన విగ్రహాన్ని నగరవాసులు నెలకొల్పారు. అయన విగ్రహం నుంచి చూస్తే వీటి కళాశాల కనిపించేంది. అయితే నేటి రాజకీయ ప్రబుద్దుల అత్యుత్సాహం కారణంగా వీరేశలింగం విగ్రహాన్ని ప్రక్కకి తప్పించి, రాజకీయా నేతల విగ్రహాలు పెట్టేసారు. 

సంఘ సంస్కర్త :. . 
ఆనాటి సమాజం మూఢ విశ్వాసాలతో చైతన్యం

లేకుండ స్త్రీ విద్యలేమి, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, దేవదాసి, భోగం మేళాలు, కళావంతులు, లంచగొండితనం తదితర అనాగరిక వ్యవహారాలను సంస్కరించేందుకు నడుంబిగించారు. ఈ దురాచారాలను ఎదురిస్తూ ముందుగా ఆయన తెలుగు వచన సాహిత్యంలో ఎన్నో రచనలు - నాటకాలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, వివేకవర్ధిని, రాజశేఖర చరిత్ర, ఆంధ్రకవుల చరిత్రమున్నగు

నూటికి పైగా రచనలతో పంతులుగారు సాంఘిక చైతన్యంకోసం అవిరళ కృషి చేశారు. సాహిత్య రచనలు, స్త్రీజనోద్ధరణ, స్త్రీ విద్య, స్త్రీల బాల్యవివాహాలు, బాల వితంతువులు, అజ్ఞానం, మూఢ విశ్వాసాలతో యున్న సమాజం స్త్రీలను అట్టడుగుకు గురిచేయడం పై ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధపడ్డారు. ఒక దశ లో ఆయన్ను చంపే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆయన్ని

వేలి వేయడం జరిగింది. దీంతో ఆయనే సొంతంగా మంత్రాలూ చదువుతూ మొక్కవోని ధైర్యంతో విధవా వివాహాలు నిర్వహించారు.  

పురమందిరం (టౌన్ హాల్) ప్రార్థనా మందిరం, “హితకారిణి” పేరుతో వితంతు శరణాలయం, విద్యాలయం కట్టించారు. వీరేశలిం భార్య రాజ్యలక్ష్మి పెళ్లినాటికి నిశాని. ఆమెకు మున్ముందుగా విద్యనేర్పి తన సంఘసేవలో

పూర్తిగా మిలితమై స్త్రీలకు, పిల్లలకు పాఠాలు చెప్పే స్థితికి తీసుకువచ్చారు. 

చిలకమర్తి లక్ష్మీనరసింహం, సి. రాజగోపాలాచారి, రాజారామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగరుల కోవకు చెందినవారు. నవయుగ వైతాళకుడు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam