DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*31 న విశాఖ లో సహజసిద్ధ ఉత్పత్తుల ప్రదర్శన*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 29, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ నగరంలో ఈ నెల 31న పర్యావరణ హితమైన అద్భుత ప్రదర్శన మేళ జరుగనుంది. సేంద్రీయ పంటలతో పాటు మరిన్ని సహజసిద్ధ ఉత్పత్తుల ప్రదర్శనను విశాఖవాసులకు పూర్తిస్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో వైజాగపటం చాంబర్ ఆఫ్ కామర్స్

మహిళా విభాగం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీచ్ రోడ్డులోని పామ్ బీచ్ హెటల్ లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 3 గంటల వరకూ జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సృజన, గౌరవ అతిథిగా నేవీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎన్ డబ్ల్యుడబ్ల్యుఏ) ప్రెసిడెంట్ దేవినా జైన్ హాజరుకానున్నారు. సహజమైన,

ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలకు అందించడమే కాకుండా ఈ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించే విధంగా మహిళామణులు ఇంతటి మంచి వేదిక ఏర్పాటుకు ముందుకొచ్చారు. విశాఖలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ ఒక వేదికను అందించడానికి ఈ సహజ జీవన ఎక్స్పోను ఏర్పాటు చేస్తున్నారు. 
ఈ సందర్భంగా వైజాగపటం చాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా

వింగ్ అధ్యక్షురాలు యడవల్లి హేమ, ఉపాధ్యక్షురాలు జీజా వల్సరాజ్ మాట్లాడుతూ వ్యాపారాలకు ఒక వేదికను అందించడమే కాకుండా.. నగర జీవన విధానంలో రసాయన మూలకాలు విడనాడి సహజసిద్ధ ఉత్పత్తులు వినియోగించేవిధంగా ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. 
మొత్తం 32 స్టాళ్లలో సేంద్రీయ పండ్లు, కూరగాయలు, తాజా

ఉత్పత్తులు, డయాబెటిస్ రైస్, సేంద్రీయ కిరాణా, సహజ చర్మ సంరక్షణ, ఆరోగ్యకరమైన భోజనం, వంట సామాగ్రి, సహజ క్లీనర్లు, మొక్కలు, కాయిర్ ఉత్పత్తులు కంపోస్టింగ్ ఉత్పత్తులు, బయో-డిగ్రేడబుల్ కంటైనర్లు ఇలాంటివెన్నో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam