DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించండి

ఏపీ సి ఎస్ కు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ లేఖ లో వెల్లడి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, జనవరి 29, 2021  (డి ఎన్ ఎస్):* ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించకుండా ఆదేశాలివ్వాలన్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్‌ విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో

జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam