DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 స్టేషన్లు మూసివేత*

*ఆదాయం లేవని ఆంధ్ర లో 7, తెలంగాణ లో 23 స్టేషన్లు* 

*రైళ్ల రద్దు చూసాం, కానీ స్టేషన్లే రద్దు ఇదే తొలిసారి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్ )*  

*సికింద్రాబాద్ / విశాఖపట్నం, జనవరి 30, 2021  (డి ఎన్ ఎస్):* ఆదాయం లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్లు క్లోజ్ చేసినట్టు

అధికారులు ప్రకటించారు. భారత రైల్వే ప్రారంభమైన నాటి నుంచి కొత్తగా రైల్వే స్టేషన్లను ప్రారంభించారు తప్ప ఇలా ఇంతా భారీ మొత్తం లో మూసివేయడం ఇదే తొలిసారి కావచ్చు. ఆంధ్ర ప్రదేశ్ పరిధిలో 

 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసి వేస్తామని అధికారులు

వెల్లడించారు. అయితే ఈ స్టేషన్ల కొన్ని స్టేషన్లు  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మరో 2 స్టేషన్లు ఏప్రిల్ 1 నుంచీ.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తమ జోన్ పరిధిలో మొత్తం 31 రైల్వే స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైల్వే స్టేషన్ల పరిధిలో ఆదాయం, రద్దీ లేని కారణంగా ఈ

చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. 

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 29 స్టేషన్లు మూతపడతాయని, ఏప్రిల్ 1 నుంచి మరో 2 రైల్వే స్టేషన్లు మూసి వేస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ స్టేషన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పరిధిలో 7 స్టేషన్లు, తెలంగాణ లో 23 స్టేషన్లు, మహారాష్ట్ర లో 1, ఉన్నాయి. ఒక్క

స్టేషన్ మాత్రం మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌ జిల్లాలో ఉంది. డివిజన్ల వారీగా చూస్తే సికింద్రాబాద్ పరిధిలో 16 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ పరిధిలో 7 స్టేషన్ల, గుంతకల్ పరిధిలో 3, గుంటూరులో 4,  నాందేడ్ పరిధిలో 1 స్టేషన్లను మూసి వేయాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఉన్నట్టుండి 31 స్టేషన్లను మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ

ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

మూసివేసిన స్టేషన్ల వివరాలు : 

సికింద్రాబాద్ డివిజన్ పరిధి లో 16 స్టేషన్లు 
1. నవడిగి -
2. అంక్సాపూర్ 
3. మరుగుత్తి 
4. పోడూరు   
5. మామిడిపల్లి
6. కట్టలి 
7. కట్లకుంట మేడిపల్లి 
8. మైలారం 
9. మహాగోన్ 
10.

కొత్తపల్లి  హవేలీ 
11. చిట్టా హల్ట్ 
12. నందగన్ హళ్లి 
13. గేట్ కారేపల్లి 
14. నుకుంపల్లి మల్లియల్ 
15. నాగేశ్వడి హల్ట్ 
16. మూర్తి హల్ట్ 

గుంతకల్ డివిజన్ పరిధి లో: 3 స్టేషన్లు   

17. వెలివేడు హల్ట్ 
18. రెడ్డిపల్లి 
19. మల్లప్ప గేట్ హల్ట్ 

గుంటూరు డివిజన్ లో : 3

స్టేషన్లు  

20. లింగంగుంట్ల హల్ట్ 
21. గుడిపూడి 
22. గుడిమెట్ల హల్ట్ 
23. మండపాడు హల్ట్ 

నాందేడ్ డివిజన్ లో 1 స్టేషన్ 

24. పింప్ల చురే హల్ట్ 

హైదరాబాద్ డివిజన్ లో:. 7 స్టేషన్లు 

25. వల్లూరు హల్ట్ 
26. శంక మగర్  
27. శంక పుర హల్ట్ 
28. ఎడపల్లి 
29. చిక్నా 
30.

పిజెపి రోడ్ హల్ట్ 
31. డోకుర్ 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam