DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1 నుంచి త్యాగరాజ ఆరాధనోత్సవాలకు కళాభారతి లో ఏర్పాట్లు

*ముఖ మాస్కు ధరించని వారికి ఉత్సవాల్లోకి ప్రవేశం లేదు:* 

*ఆంధ్ర తిరువాయూర్ విశాఖ వేదికగా ఉత్సవాల నిర్వహణ*

*బాలకొండలరావుకు నృత్య కళాభారతి బిరుదు: జిఆర్ కె ప్రసాద్*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 31, 2021  (డి ఎన్ ఎస్):* సంగీత సరస్వతి, ప్రముఖ

వాగ్గేయకారులు, త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలను ఆంధ్ర తిరువాయూర్ గా కొనియాడబడుతున్న విశాఖపట్నం కళాభారతి వేదికగా ఫిబ్రవరి 1 నుంచి 6 వరకూ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ కార్యదర్శి జి ఆర్ కె ప్రసాద్ ( కళాభారతి రాంబాబు ) తెలిపారు. ఆదివారం కళాప్రాంగణం వద్ద ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు  పై మాట్లాడుతూ

వర్ధమాన, ఔత్సాహిక, సీనియర్ కళాకారులందరితోనూ సంగీతోత్సవాలను గత 27 ఏళ్లుగా ఎంతో వైభవంగా విశాఖనగరం నిర్వహిస్తున్నామన్నారు.

ఫిబ్రవరి రెండు త్యాగరాజస్వామి వారి పుణ్యతిథి అయిన పుష్య బహుళ పంచమి అనీ, ఒకరోజు ముందు ఉత్సవాలు ప్రారంభిస్తున్నామనీ తెలిపారు. 

నృత్యకళాభారతి బిరుదు ప్రదానం: .

.

త్యాగరాజ ఆరాధన ఉత్సవాల ప్రారంభోత్సవం కు ముందుగా తొలి ఘట్టం లో  జరిగే వేడుకల్లో  ప్రముఖ కళాకారులను సముచిత రీతిన సత్కరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సంవత్సరం  నృత్యకళాభారతి  ప్రఖ్యాత అవార్డుని ప్రముఖ నాట్య కళాకారిణి ఏ బి బాల కొండల రావు కు అందించేందుకు విశాఖ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఎకగ్రీవంగా

నిశ్చయించిందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత విశ్వ ప్రఖ్యాత మృదంగ కళాకారులూ, మృదంగ రత్నాకర వి. కమలాకర రావు హాజరవుతారని తెలిపారు. ప్రముఖ సంగీత విద్వాంసులు, ఉత్తరాంధ్ర వాసులు, ద్వారం దుర్గా ప్రసాదరావు వయలిన్ కచేరి తో పాటు గాత్ర కచేరీ కూడా చేయనున్నారని వివరించారు. 

ఫిబ్రవరి 2 నుంచి కచేరీలు :

  

ఉత్సవాల్లో ద్వితీయ ఘట్టం, ప్రధానమైన సంగీత నీరాజనం ఫిబ్రవరి 2 నుంచి ఆరంభం కానున్నాయని, ఆ రోజు ఉదయం  7 గంటలకి కళాభారతి ప్రాంగణంలో ఉన్న త్యాగరాజ స్వామి ఆలయం వద్ద త్యాగరాజ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను పల్లకిలో ఉంచి కళాభారతి చుట్టూ 150 మంది కళాకారులు

గాత్రం చేస్తూ, ఊరేగింపు చేస్తూ ఉండగా తిరువీధి కార్యక్రమం కొనసాగుతుంది.

అనంతరం 8 గంటల 20 నిమిషాలకు ముఖ్యఅతిథి జ్యోతి ప్రజ్వలనం చేయగా కళాకారులందరూ సామూహికంగా త్యాగరాజస్వామి పంచరత్న కృతులను గానం చేస్తారు. పంచరత్న సేవ అనంతరం గురువిల్లి అప్పన్న బృందం చే సన్నాయి వాయిద్య కచేరి తో సంగీత కచేరిలు సాయంత్రం వరకూ

నిర్విరామంగా సాగనున్నాయన్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ 10 నిమిషాలు, 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివి గల సంగీత కార్యక్రమాలు జరుగుతాయి.  
ఆఖరు రోజైన 6 వ తేదీన సాయంత్రం 8 గంటలకు ఆంజనేయ ఉత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం, చతుర్వేద పారాయణం, 108 వడల మాల సమర్పణ, మంత్రపుష్పం,  మంగళ హారతి, ప్రసాద వితరణతో ఆరు రోజుల త్యాగరాజ

ఆరాధన ఉత్సవాలు ముగుస్తాయన్నారు.  

కరోనా రక్షణ హెచ్చరికలు :

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నందున అత్యంత పటిష్టమైన నిబంధన చర్యలను పాటిస్తున్నామన్నారు. కళా ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ముఖానికి మాస్కు లు ధరించాలన్నారు. ముఖ మాస్కు లేనివారికి ప్రాంగణంలోకి ప్రవేశం

లేదన్నారు. అదే విధంగా ఆడిటోరియం లో సీటింగ్ లో ఒక కుర్చీ తర్వాత రెండవ కుర్చీ ఖాళీగానే ఉంటుందన్నారు. దానికి సీల్ వేసేశామన్నారు. ప్రతి గెట్ వద్ద శానిటైజర్ లు అందుబాటులో ఉంటాయన్నారు. 

ఈ ఏడాది మొత్తం 608 మంది కచేరీల్లో పాల్గొంటున్నారన్నారు. సీనియారిటీని బట్టి ప్రముఖులకు ఎక్కువ సమయం కేటాయించామని, 15 నిమిషాల

కచేరీలు ఆరు, 30 నిమిషాల కచేరీలు 27 ఉన్నాయని వివరించారు. ఎ- టాప్ గ్రేడ్ కళాకారులు ఆరుగురు, ఏ గ్రేడ్ పదిమందీ ఉన్నారన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam