DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామ మందిరానికి 80 ఏళ్ళ సాధువు కోటి విరాళం. 

*అకౌంట్ లో కోటి ఉందొ లేదో అని . .షాక్ లో బ్యాంకు క్రూ*   

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జనవరి 31, 2021  (డి ఎన్ ఎస్):* రిషికేశ్ కు చెందిన 80 ఏళ్ళ స్వామి శంకర్ దాస్ అనే 'ఫక్కాడ్ బాబా' అయోధ్యలోని రామ్ ఆలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళం అందించారు. సుమారు 60 ఏళ్లుగా

హిమాలయాల్లోని ఒక గుహను తన నివాసంగా చేసుకున్న ఈయన తనకు భక్తులు ఇచ్చిన విరాళాలను, యావత్తు అయోధ్య మందిరానికి ఇచ్చారు. మందిర నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఈయన ఈ కోటి రూపాయలను మందిర నిర్మాణ ఖాతాకు బదలాయించవలసిందిగా భారతీయ స్టేట్ బ్యాంకు, రిషికేష్ శాఖా వారికీ లేఖ ఇవ్వగానే, ఒక్కసారిగా

బ్యాంకు అధికారులు షాక్ కు గురయ్యారు. ఒక సాధువు ఖాతాలో ఇంట డబ్బు ఉంటుందా అనే అనుమానం తో అయన ఖాతాను పరిశీలించారు, అంటే ఖాతాలో ఉన్న నిధులను చూసి ఒక్క సారిగా బ్యాంకు అధికారులు నివ్వెరపోయారు. దీంతో సంబంధిత నిధి సేకరణ బృందానికి సమాచారం పంపి వారిని బ్యాంకు కు ఆహ్వానించారు. సాధువు ద్వారా నేరుగా ఈ చెక్ ను నిధి సేకరణ

బృందానికి అందించారు. ఈ సందర్భంగా ఫక్కాడ్ బాబా మాట్లాడుతూ గత 60 ఏళ్లకు పైగా ఒక గుహలో నివసిస్తున్నానని, భక్తుల సందర్శనంతో తమ గుహ నిండిపోతుందన్నారు. ఈయన స్ఫూర్తిగా ఎందరో భక్తులు నిధుల సేకరణ బృందానికి సాదర పూర్వక ఆహ్వానం పలుకుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam