DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవత్వానికి మారురూపం కాశీబుగ్గ మహిళా ఎసై శిరీష

*ఒంటరిగా, ధైర్యంగా అనాధ ప్రేతానికి అంత్యక్రియలు. .*

*భాద్యత విస్మరించద్దు, మానవత్వం మరిచిపోవద్దు: ఎస్ఐ శిరీష.* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, ఫిబ్రవరి 01, 2021  (డి ఎన్ ఎస్):* మానవత్వానికి మారుపేరుగా నిలిచిన కాశీబుగ్గ మహిళా ఎసై కుమారి శిరీష ధైర్య

సాహసాలకు సర్వత్రా అభినందనలు లభిస్తున్నాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న ఈమెకు సోమవారం తెల్లవారుఝామున పొలాల్లో అనాధ వృద్ధుని మృత దేహం ఉందని ఫోన్ రావడంతో ఒంటరిగానే ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడం, మోటార్ సైకిల్ సైతం ఆ పొలాల్లో కి వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడే

ఉన్న ఒక స్థానికుని సహకారం తో ఆ మృత దేహాన్ని రెండు కర్రలకు ఒక దుప్పటి గట్టిగా కట్టి, వాహకంగా తయారు చేసి, తన భుజంపై మోసుకుంటూ సుమారు అర కిలో మీటర్ పైగా నడుచుకుంటూ రోడ్డు సమీపానికి చేరుకున్నారు. అనంతరం కాశీబుగ్గలోని లలితా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు ఫోన్ చేసి, వారి సహకారంతో ఆ వృద్ధునికి అంత్య సంస్కారాలను

నిర్వహించడం జరిగిందని శిరీష తెలియచేస్తున్నారు.  ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆమె ధైర్య సాహసాలకు, ఆమె చూపిన మానవతావాదానికి అభినందనలు తెలిపారు. విశాఖ కు చెందిన శిరీష గతంలోనూ జి. సిగడం ప్రాంతంలోనూ పలు సేవాకార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. 

ఎవ్వరూ భాద్యతలను విస్మరించవద్దని, మానవత్వాన్ని మరిచిపోవద్దని

ఎసై శిరీష తెలియచేస్తున్నారు. తానూ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానని, స్మశానానికి కూడా ఏనాడు వెళ్లలేదని, అయితే ఒక వృద్ధుడు ఇలా అనాథలా ఉండడం చూసి తట్టుకోలేకపోయానన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వ విలువలు కోల్పోరాదని, కంటే కూతుర్నే కనాలి అనే సందేశం మరొక్కసారి గుర్తుకు వచ్చిందన్నారు. తన తోటి సిబ్బంది ని విధి నిర్వహణలో తప్ప

సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏనాడు నిర్బంధించలేదన్నారు. వారు సైతం స్ఫూర్తిని చాటుతున్నారని తెలిపారు. పోలీసులు ప్రజల్లో భాగమేనని, వారికి అండగా, రక్షగా నిలుస్తున్నారు అనేందుకు శిరీష చేసిన మహత్తర కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam