DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నగర రైతు బజార్లకు వారంలో ఒక రోజు సెలవు: జెసి

*సీతమ్మ ధారకు మంగళ, ఎంవిపి కి బుధవారం సెలవు.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం నగరంలోని రైతుబజార్లకు  వారంలో ఒక రోజు సెలవు మంజూరు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి తెలిపారు. రైతుబజార్లలో  పరిశుభ్రత,

నిర్వహణ నిమిత్తం నగరంలో ఉన్న 11 రైతుబజార్లకు మంగళవారం లేదా బుధవారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతీ మంగళవారం నగరంలోని గోపాలపట్నం, కంచరపాలెం, సీతమ్మధార, పెదవాల్తేరు, పెదగంట్యాడ, ములగాడ రైతు బజార్లకు సెలవు ప్రకటించారు. ప్రతీ బుధవారం ఎం.వి.పి.కాలనీ, నరసింహనగర్, మర్రిపాలెం, గాజువాక, పెందుర్తి, స్టీల్ ప్లాంట్,

మధురవాడ, రైతు బజార్లకు  సెలవు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విధానం ఫిబ్రవరి 2వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని రైతులు, వినియోగదారులు  గమనించాలన్నారు. ఆయా రైతు బజార్లకు ఏ రోజు సెలవు అనే బోర్డు లను కూడా ఉంచామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam