DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో హిందూ విగ్రహాల ధ్వంసం పై సాధుపరిషత్ ఆగ్రహం. 

*హిందూ ధార్మిక రక్షణ చేపట్టేందుకు నడుంబిగించిన సాధుపరిషత్*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర లో హిందూ దేవీదేవతలు విగ్రహ ధ్వంసం, ఆలయాలపై దాడులు, ప్రశ్నించేవారిపై అక్రమ కేసుల పై హిందూ సాధు పరిషత్ మండిపడుతోంది. ఈ తరహా ఆగడాలను

అడ్డుకోవాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని సాధుపరిషత్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని పై చర్చించేందుకు ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు లోని తిరువళ్లూరు జిల్లా పొన్పాడిలో పలువురు స్వామీజీలు, వివిధ మఠాధిపతులు, సాధువులు బుధవారం సాయంత్రం 3 గంటలకు రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ

సమావేశంలో హిందూ వ్యతిరేక శక్తులను అడ్డుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని, అది ఘోరం గా విఫలం చెందిన నేపథ్యంలో స్వామిజిలే నడుంబిగించేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు అందుతున్నాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులోని ప్రధాన స్వామీజీలకు ఆహ్వానం వెళ్లినట్లు తెలిసింది. ఏపీ

నుంచి 10-15 మంది స్వామీజీలు వస్తున్నారని, ఏపీకి చెందిన వారే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మీడియాను దగ్గరికి రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పీఠాలను

నిషేధించినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam