DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన వైద్య విద్యార్ధికి మాజీ ఎమ్మెల్యే ఆకుల చేయూత

*మెరిట్ విద్యార్థికి ఆర్ధిక ఇబ్బంది రానివ్వం: డా. ఆకుల*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 03, 2021  (డి ఎన్ ఎస్):*  రాజమండ్రి : ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన గిరిజన పేద వైద్యవిద్యార్ధి చెంచురాజును చదివించే బాధ్యత తీసుకుంటున్నట్టు రాజమండ్రి సిటీ మాజీ

ఎమ్మెల్యే, వైసీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, లక్ష్మీ పద్మావతి దంపతులు వెల్లడించారు. ఆల్ఇండియా స్థాయిలో నీట్లో 14వ ర్యాంకు సాధించి రాజమండ్రి జిఎస్ఎల్ లో చదువుతున్న మారేడుమిల్లి మండలం చెట్లవాడకు చెందిన చెంచురాజు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. వైద్య పుస్తకాలు, ఇతర వైద్యవిద్య పరికరాలు కొనుగోలు,

ఫీజులకు డబ్బులు లేక ఆర్ధిక ఇబ్బందులతో ఈనెల 1న కొంతమూరులోని తనరూంలో ఎలకల మందు తిని చెంచురాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న చెంచురాజును  మాజీ ఎమ్మెల్యే ఆకుల దంపతులు బుధవారం రాత్రి  పరామర్శించి పూర్తి ధైర్యం చెప్పారు. ఓదార్చి ఎపుడూ ఇలా అధైర్యంగా

వుండొద్దని, వైద్యవిద్య పూర్తయ్యే అవసరమైన ఖర్చును తాము పూర్తిగా భరిస్తామని మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, లక్ష్మీపద్మావతి దంపతులు హామీ ఇచ్చారు. ఎపుడు ఎలాంటి అవసరం వచ్చినా నిరుత్సాహాపడకుండా తనను సంప్రదించాలని సూచించారు.  తక్షణం సహాయం గా 50వేల రూపాయల నగదును చెంచురాజుకు ఆర్ధికసాయంగా ఆకుల సత్యనారాయణ, లక్ష్మీ

పద్మావతి దంపతులు అందజేశారు. వైద్యవిద్యార్ధి చెంచురాజు ఖాళీసమయంలో షాపులలో పనులు చేసుకుని వాటి ఆధారంగా  వచ్చే ఆదాయం తో రెండు సంవత్సరాలు ఎంబిబిఎస్ పూర్తిచేశాడు చెంచురాజు. మూడో ఏడాది లో ఎంబిబిఎస్ చదివేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ, చెంచురాజు ఆత్మహత్యయత్నం చేసిన  పరిస్థితిని ఎస్.బి డిఎస్పీ వర్మ ద్వారా ఆకుల

సత్యనారాయణ తెలుసుకుని వెంటనే స్పందించి సహాయం అందించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు అనేకమంది మంది పేద విద్యార్ధులకు డా.ఆకుల దంపతులు సాయం అందిస్తూ వుంటారు.

 అలాగే కాంట్రాక్టర్  తమ్మయ్యనాయుడు 25వేల రూపాయలు చెంచురాజుకు ఆర్ధికసాయం అందచేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam