DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలోని విభాగాల్లో టిటిడి చైర్మన్ ఆకస్మిక తనిఖీ

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 05, 2021  (డి ఎన్ ఎస్):* తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ)  చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమలలో పలు విభాగాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల సడలింపు అనంతరం భక్తులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనేకమంది

భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అన్న ప్రసాదం భవనంలోని భోజన శాలల్లోకి వెళ్లి, భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడారు. భక్తులు తిరుమలకు ఎప్పుడు వచ్చారు? వసతి సులువుగానే దొరికిందా? దర్శనంలో ఇబ్బందులు ఉన్నాయా? అన్న ప్రసాదం నాణ్యత, రుచి ఎలా ఉందని అనేకమంది మంది భక్తులతో మాట్లాడి

వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. సుమారు గంట పాటు తనిఖీలు చేసిన ఛైర్మన్ సుబ్బారెడ్డి శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వసతి, భోజనం, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam