DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేట్ కాకుండా ప్రయత్నిస్తాం

*ఆంధ్ర బీజేపీ కమిటీ దీనిపై మంత్రివర్గాన్ని కలుస్తుంది*

*కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి భారీ ప్యాకేజీలే ఇచ్చాం*

*6 విభాగాల్లో ఆరోగ్యం, వ్యవసాయాలకు అధిక ప్రాధాన్యత*

*విభజనలో ఏపీ కి ఇచ్చిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నాం* 

*విశాఖ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి

వెల్లడి*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 07, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేట్ పరం కాకుండా ప్రయత్నిస్తామని భారతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఆదివారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ

విశాఖనగరం, స్టీల్ ప్లాంట్ లతో తనకు, ఇతర బీజేపీ ప్రతినిధులందరికీ ప్రత్యక్షంగా అనుబంధం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో తాము కూడా ఏకీభవించడం లేదని, ఇప్పడికి ఉత్తరాంధ్ర ఎం ఎల్ సి పివిఎన్ మాధవ్ కేంద్ర మంత్రి దృష్టికి నేరుగా ఈ విషయం తీసుకెళ్లారన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేట్ పరం చేసేందుకు కేంద్రం

సిద్ధమైనట్టు ప్రకటన చేసిన తరువాతనే మాకు కూడా తెలిసిందన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పడికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కీలకమైన ప్రకటన చేశారన్నారు. 
ఈనెల 17 న బీజేపీ లో రాష్ట్ర స్థాయి కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని, సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు,

బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డా తదితరులను ప్రత్యక్షంగా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత ను తెలియచేస్తామన్నారు. ఇది తిరిగి లాభాల బాటలో నిలబడి పూర్తిగా కోలుకునేందుకు గనుల కేటాయింపును కూడా కోరతామన్నారు. 

కేంద్ర బడ్జెట్ పై. . .: 
 
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కి భారీ ప్యాకేజీలే ఇచ్చామని,

ప్రధానంగా 6 విభాగాల్లో ఆరోగ్యం, వ్యవసాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయంలో విశాఖ పట్నం కేంద్రంగా రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించిందని, అయితే ఇప్పడికే డిపిఆర్ సిద్ధం చేసి, రేల్వే బోర్డు కు పంపడం జరిగిందన్నారు. బోర్డు నిర్ణయం తదుపరి ఆచరణ లోకి వస్తుందన్నారు. ఇక విశాఖ మెట్రో కూడా

బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని, రాష్ట్ర విభజనకు సంబంధించి ఏవి రాలేదో చేయలేదో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజి కి ఒప్పుకుంటూ నాటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆమోదాన్ని తెలిపిందన్నారు. దీనికి సంఘీభావంగా కేంద్రమంత్రులకు సమ్మానం కూడా చేశారన్నారు. 

రైతులకు

బిజెపి ప్రభుత్వం కనీస మద్దతు ధర వంద శాతం పెంచిందని, కనీస మద్దతు ధర అంశంలో స్వామినాధన్ కమిటీ  50 శాతం ధరను ఇవ్వాలని చెప్పిందని, అయితే కేంద్రం 20 శాతం పెంచిందన్నారు.  

కరోనా తో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక అసాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారని, ఏ రంగంలో భారం పడుతుందో అనే భయం అందరికి వచ్చిందన్నారు. 5 ట్రిలియన్ డాలర్

టార్గెట్ దిశగా ఈ బడ్జెట్ ఉందన్నారు. 

జిడిపి లో 4 శాతం ఆరోగ్యానికి కేటాయించాలని అనుకున్న రెండు శాతం కు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. రోగ నిరోధానికి 34 వేల కోట్లు టీకాలకు అనుమతి ఇచ్చారు. 
జల జీవన్ మిషన్ కి కేటాయింపులు ఇచ్చారన్నారు. 

మానవ వనరుల అభివృద్ధి కి పెద్ద పీట వేశారని, వంద సైనిక స్కూల్

తెరవాలి అనే ఆలోచన ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. పెట్టుబడులు కోసం ఒక వాతావరణం ఏర్పాటు చేశారని, అన్నివిధాల యువత, బిడ్డల భవిష్యత్ కోసం 40 వేల కోట్లు అధునాతన మౌలిక ఏర్పాట్లు చేశారన్నారు. 

ఈ విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

పి విష్ణు కుమార్ రాజు, మాజీ ఎంపీ హరిబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి కె సుహాసిని ఆనంద్, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam