DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కూడినది, ప్రైవేట్ పరం కానివ్వం

*పేరుకి మాత్రమే ప్రభుత్వం, ప్లాంట్ ఏనాడో ప్రైవేట్ పరమైంది*

*రెగ్యులర్ ఉద్యోగులు తక్కువ, కాంట్రాక్టు వాళ్ళే ఎక్కువ*

*విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ పై ఎమ్మెల్సీ మాధవ్ వివరణ*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 07, 2021  (డి ఎన్ ఎస్):*

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షలాది మంది ప్రజల సెంటిమెంట్ తో అనుబంధం ఉన్నదని, ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేట్ పరం కానివ్వమని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ తెలిపారు.  ఆదివారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణపై ఆయన మాట్లాడుతూ  పేరుకి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థ అని,

ప్లాంట్ ఏనాడో ప్రైవేట్ పరమైందని అన్నారు. ప్రస్తుతం ప్లాంట్ లో రెగ్యులర్ ఉద్యోగులు కేవలం 16 వేలమందే ఉన్నారు. దాదాపు ప్రతి విభాగంలోనూ వందలసంఖ్యలో ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగులే ఉన్నారన్నారు. అన్ని పనులు కేవలం కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణలోనే జరుగుతున్నాయని, అన్ని టెండర్ల విధానంలోనే జరుగుతాయన్నారు. అయితే సంస్థ పై

ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఉందని, ఒక్క సెంటు భూమి కూడా ప్రైవేట్ పరం కనివ్వమన్నారు. కాబినెట్ కమిటి ఆప్ ఎకనామిక్ ఎఫైర్ స్టీల్ ప్లాంట్ నిర్ణయం వ్యతిరేకిస్తున్నామన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు 
ఎల్ ఐ సి, ఎయిర్ ఇండియా, ఆర్ ఈ ఎన్ ఎల్ కూడా ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయం తీసుకున్నారన్నారు. 

బిజెపి గతం లో

కూడా అధికారంలోకి వచ్చినప్పుడు సైతం విశాఖ ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణకు కృషి చేసామని, హిందూస్తాన్ షిప్ యార్డ్, డ్రెజింగ్ కార్పొరేషన్లను  కాపాడం తో పాటు, బీహెచ్ పివి ని సైతం బీహెచ్ ఈ ఎల్ లో కలిపి, ఒక్క ఉద్యోగికి కూడా నష్టం లేకుండా చూశామన్నారు. హిందూస్తాన్ జింక్ సంస్థ తో కాలుష్య ప్రభావం ఉండడంతో మాత్రమే దాన్ని వేదాంత

సంస్థ కు విక్రయించడం జరిగిందన్నారు. 

స్టీల్ ప్లాంట్ విషయం లో ప్రకటన జరిగిన తరువాత ఢిల్లీ వెళ్లి మాట్లాడం జరిగిందన్నారు. స్టీల్ ప్లాంట్ విశాఖ ను వదిలి పోదన్నారు. సంస్థల వాళ్ళ నష్టాలూ అధికంగా ఉంటె విక్రయించడంలో తప్పు లేదన్నారు. ప్రైవేట్ పరం చేయడాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించవని, అయితే రాజకీయ

ప్రయోజనం పొందేందుకు మాత్రమే కార్యాచరణ చేస్తున్నాయన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణు కుమార్ రాజు, తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam