DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పార్టీ ఏదైనా. . అదే సేవాభావం డా. ఆకులకే సొంతం

*All eligible irrespect of party be beenefited, Dr. Akula*

*అందరికీ అందుబాటులో ఉంటూ. . ఆదుకుంటూ. .* 

*అజాతశత్రువు మాజీ ఎమ్మెల్యేతో DNS బ్యూరో మాటా మంతి* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 08, 2021  (డి ఎన్ ఎస్):* *అందరికీ అందుబాటులో ఉంటూ. . ఆదుకుంటూ. ., అందర్నీ కలుపుకుంటూ పనిచేసే నిస్వార్ధ

రాజకీయ నేతల్లో అరుదైన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణ. అసంతృప్తి పరులను సైతం ఆమోదించగలిగే విధంగా కార్యాచరణ చెయ్యగల దిట్ట. గతంలో బీజేపీ తరపున శాసన సభ్యునిగా గెలిచినా, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  రాజమండ్రి నగర సమన్వయ కర్తగా ఇటీవలే భాద్యతలు చేపట్టిన

సందర్బంగా ఆయన తో DNS  బ్యూరో చీఫ్ (అమరావతి ) తో తన అనుభవాలను తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ ఈ బాధ్యతలు స్వీకరించి నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తానని, త్వరలో జరుగనున్న నగర కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే లభించే విధానంగా

క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. గతం వరకూ పార్టీ లో భిన్న స్వరాలూ వినిపించి ఉండవచ్చని, అయితే ఇకపై అందరిని ఒకే త్రాటిపైకి తీసుకు వచ్చి, పార్టీ కార్యకర్తలు ,నాయకుల్ని, మద్దతుదారులను కలుపుకుంటూ వారి సహకారంతోనే మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్తామన్నారు. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

చేపడుతున్న నవరత్నాలలో ప్రతి ఒక్క సంక్షేమ పధకాన్ని అర్హులైన లబ్ధిదారులందరికీ పార్టీలకు అతీతంగా అందేలా కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నగర వాసులు స్వచ్చందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఓటువేసి విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. గత ఏడాది నుంచి విద్యార్థులందరికీ అమ్మఒడి, నవశకం, ద్వారా

ఉపకారవేతనాలు అందించామని, వృద్ధాప్య పింఛన్ లు ప్రతి నెల ఒకటవ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటికే చేరేలా చర్యలు తీసుకున్నామని, వీటన్నింటికి అదనంగా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల  స్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. 
రాష్ట్రంలోని ప్రతి మహిళా  ఆనందంగా ఉన్నప్పుడే ఆయా ఇల్లు ఆనందంతో ఉంటాయని, తద్వారా

రాష్ట్రమంతా సంతోషంగా ఉంటుందని, ఏకైక సంకల్పనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. 

నవరత్నాలు  వాటి ఉద్దేశాలను ప్రజలకు తెలియజేసి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు తాను కోఆర్డినేటర్ గా రాజమండ్రిలో ప్రజలు ఆకట్టుకునే విధంగా మంచి కార్యక్రమాలను రూపొందించి నా పట్ల

పార్టీ పట్ల మంచి అభిప్రాయం తో ఉండేవిధంగా కార్యక్రమాలను రూపొందిస్తానని ఆయన చెప్పారు 

రాజమండ్రి సిటీ వైయస్సార్ సిపి కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్ప చెప్పినందుకు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam