DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాంట్ కోసం రాజీనామాపై రాజీపడేది లేదు: గంటా శ్రీనివాస్ 

స్పీకర్ ఫార్మాట్ లో లెటర్ తెండి, సంతకం చేస్తా...* 

*ఆల్ పార్టీ మీట్ లో ఖాళీ లెటర్ హెడ్ ఇచ్చిన ఎమ్మెల్యే * 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 08, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేట్ పరం కాకుండా ఉండేందుకు చేసిన రాజీనామా పై

ఎటువంటి రాజీపడేది లేదని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు ప్రకటించారు. సోమవారం విశాఖపట్నం నగరం లో జరిగిన ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన తన ఖాళీ లెటర్ హెడ్ మీడియా కు ఇచ్చి, దీనిపై స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ వ్రాసి తీసుకురావాలని, మంగళవారం ఉదయం 11 గంటలకు తన ఇంటికి రావాలని దానిపై మీడియా సాక్షిగా

సంతకం చేస్తా అన్నారు. ప్లాంట్ కోసం రాజీనామా చేసిన మొదటి ప్రజా ప్రతినిధిని తానేనని, దీనిపై వివిధ వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయన్నారు. అయితే తన రాజీనామా పట్ల ప్రజల్లో మద్దతు చూసిన తర్వాతే అధికార పార్టీ ప్రతినిధులు తప్పని సరిగా వాళ్ళు కూడా రాజీనామా చేస్తామంటూ ప్రకటన చేశారన్నారు. ప్లాంట్ ప్రయివేటీకరణ పునరాలోచన

చెయ్యాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కి లేఖవ్రాయడాన్ని గంట శ్రీనివాస్ స్వాగతించారు. 

 ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మీడియా ప్రతినిధులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam