DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించండి

*ఫ్లాగ్ మార్చ్ లో ఏలూరు డిఐజి మోహన్ రావు పిలుపు*  

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 11, 2021  (డి ఎన్ ఎస్):* ఈ నెల 13 న జరుగనున్న రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంతంగా అందరూ పాల్గొనాలని అవగాహనా కల్పిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో

పోలీసులు భారీ ర్యాలీ చేపట్టారు. గురువారం జరిగిన ఈ ర్యాలీలో ఏలూరు డిఐజి కె వి మోహన్ రావు సైతం పాల్గొని అతి సమస్యాత్మక గ్రామాలైన  తేతలి  మొదలైన గ్రామాల్లో ప్రజలకు ధైర్యాన్ని నింపారు. 

ఈ కార్యక్రమం లో ఏఅర్ అదనపు ఎస్పీ  ఎం మహేష్ బాబు, కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్, తణుకు సీఐ కృష్ణ చైతన్య, తాడేపల్లిగూడెం

రూరల్ సిఐ వి రవి కుమార్  మరియు ఎస్సైలు  వారి యొక్క సిబ్బంది మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో సందర్శించి, సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి గ్రామాల్లో అవగాహన కల్పించారు. 
ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డిఐజి మాట్లాడుతూ మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో మరియు రేంజ్ పరిధిలో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల

నిర్వహణ చేసిన పోలీస్ సిబ్బంది, ఎన్నికల నియమ నిబంధనలు గురించి  ప్రజలకు అవగాహన కల్పించి ఎలక్షన్ నిర్వహించిన మొదటి దశ మాదిరిగానే రెండవ దశ కొవ్వూరు రెవెన్యూ డివిజన్ లో ఎన్నికల నిర్వహణ కొరకు పోలీసు సిబ్బంది సమాయత్తం అయి ఉన్నారని ఈ సందర్భంగా డీఐజీ గారు ఎవరికైనా సందేహాలు ఉన్నాయి ఎడల నివృత్తి చేసుకోవాలని కోరగా ఒక

వ్యక్తి ఎన్నికల అనంతరం జరిగిన కౌంటింగ్ ఏదైనా వీడియో గ్రాఫ్ తీస్తారా అని అడుగగా అంతట డీఐజీ అతనికి సమాధానం తెలియజేస్తూ ప్రతి విషయాన్ని కలెక్టరేట్లో ఉన్న 4 కెమెరాల ద్వారా లైవ్ టెలికాస్ట్ ద్వారా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని, అదే విధముగా ఉపసర్పంచ్ ఎన్నికలను కూడా వీడియో గ్రాఫ్ తీస్తామని, ఎవరికీ అయినా సదరు ఎన్నికలలో

అనుమాన నివృత్తి కొరకు ఆ వీడియో గ్రాఫర్ కూడా పరిశీలన కొరకు అధికారులకు ఇస్తామని తెలియజేసినారు. తెలియజేసినారు, ప్రజలు ఈ ఎన్నికల నిర్వహణ కొరకు పోలీస్ సిబ్బందికి సహకరించాలని, ప్రజలకు  ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురుంచి తెలుపుతూ,  ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రజలు అందరూ సహకరించాలని, శాంతియుతంగా ఎన్నికలు

నిర్వహణకు సహకరించాలని, ప్రలోభాలకు గురికాకుండా... అనవసరపు ఘర్షణలలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచిస్తు ప్రజల్లో చైతన్యం భావాన్ని కల్పించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam