DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా సాగుతున్న సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వేదయాత్ర

*భీమిలి శివానంద ఆశ్రమం లో రెండవరోజు వేద యాత్ర*

*నాలుగు వేద పారాయణలతో భారత దేశ ఆలయాల యాత్ర*  

*ఫిబ్రవరి 14 న మొదలైన యాత్ర 30 రోజుల పాటు భారత పరిక్రమణ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం కు చెందిన సప్తఋషి

చారిటబుల్ ట్రస్ట్ సారధ్యంలో చేపట్టిన భారత పరిక్రమణ శంకర యాత్ర రెండవ రోజైన సోమవారం భీమిలి సద్గురు శివానంద మూర్తి ఆశ్రమం లో వైభవంగా సాగుతోంది. ఆదివారం విశాఖలోని ఆశ్రమం వద్ద మొదలైన ఈ వేదపఠన యాత్ర విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, శ్రీ సంపత్ వినాయకగర్, శ్రీ కనక మహాలక్ష్మి ఆలయాల్లో విజయవంతంగా

పూర్తి చేసింది. నెలరోజుల పాటు అద్భుతమైన వేద ఘోషతో భారత పరిక్రమణ చేపట్టనున్న ఈ యాత్ర ట్రస్ట్ నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ ఆధ్వర్యవం లో జరుగుతోంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆదిశంకరాచార్యులు చేపట్టిన వేదయాత్ర స్ఫూర్తిగా 30 రోజుల పాటు నాలుగు వేదాల పారాయణలతో భారత దేశ ఆలయాలను సందర్శించనున్నట్టు తెలిపారు. ఈ

యాత్రకు ఫిబ్రవరి 14 న శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ యాత్ర లో ఒక్కక్క వేద పండిత బృందం ఒక్కో దిశలో ప్రయాణిస్తుందన్నారు. ఋగ్వేద,  కృష్ణ, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వ వేద పండితులు ఒక్కో దిశలోని ఆలయాలను సందర్శిస్తూ అక్కడ ఆయా వేద ఋక్కులను పఠనం చెయ్యడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 14 న మొదలయ్యే ఈ ఆధ్యాత్మిక పవిత్ర యాత్ర

మార్చి 14 నాటికి విశాఖ చేరుతుందన్నారు. 

సప్తఋషి  వేద సంస్కృత పాఠశాల,  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, సంపత్ వినాయకగర్ ఆలయం, కాళీమాత గుడి, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయం, సప్త ఋషీశ్వర ఆలయం, శివానందమూర్తి ఆశ్రమం, అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం క్షేత్రం, శ్రీముఖలింగం, కోణార్క్, పూరి లోని

శ్రీ జగన్నాధ స్వామి ఆలయం, సిరసపల్లి లోని చింతామణి గణపతి ఆలయం, అనకాపల్లి గౌరీపరమేశ్వర ఆలయం, తుని తపోవనం స్వామిజి ఆశ్రమం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం, కృష్ణానది, విజయవాడ దుర్గ గుడి, మంగళగిరి పానకాల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, శ్రీకాళ హస్తి ఆలయం, తిరుమల క్షేత్రం

శుక్ల / కృష్ణ యజుర్వేదం:

.. 

కంచి లోని విష్ణు వరదరాజ స్వామి ఆలయం, శివకంచి లోని కామాక్షి ఆలయం, కామకోటి పీఠం, అది శంకరాచార్య జన్మస్థానం కలది, గురువాయూర్, శ్రీనగేరి, శివమొగ్గ, కొల్హాపూర్, త్రయంబకేశ్వర, నాసిక్, ఓంకారేశ్వర, ఉజ్జయిని ( మహాకాళేశ్వర్), కాలభైరవ క్షేత్రం.

సామవేదం పారాయణ: 
ద్వారకా, కురుక్షేత్రం, శ్రీనగర్,

శంకరాచార్య హిల్స్,  

అధర్వ వేద పారాయణ:

జమ్మూ, జాగేశ్వర్, అయోధ్య, గయా, వారణాసి, త్రిపుర, కలకత్తా, విశాఖపట్నం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam