DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో మార్చి10 న మునిసిపల్ ఎన్నికలు నిర్వహణ  

గతం లో నిలిపిన ప్రక్రియ కు కొనసాగింపుగానే. . .

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సంబరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా

మార్చి 10 నుంచి మునిసిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసారు. మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లకు,  75 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరుగనున్నట్టు ప్రకటన విడుదల చేసారు. 

గతం లో 2020 న ఇచ్చిన ప్రకటన కోవిడ్ కారణంగా నిలిపిన ప్రక్రియ కు కొనసాగింపుగానే ఈ ఎన్నికలను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. దీని

ప్రకారం  

 అభ్యర్థుల విరమణ  ను మార్చి 2 ,2021 నుంచి మొదలవుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం  
అబ్యర్థుల నిష్క్రమణ కు గడువు మార్చి 3 వ తేదీ 2021, మధ్యాహ్నం 3 గంటల లోపు. 
ఎన్నికల బరిలో నిలిచినా అభ్యర్థుల ప్రకటన మార్చి 3 వ తేదీ 2021, మధ్యాహ్నం 3 గంటల తర్వాత 
ఎన్నికల తేదీ :  మార్చి 10 ,2021

 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 
అవసరమైన చోట్ల ఉప ఎన్నిక : మార్చి 13 ,2021  
ఎన్నికల కౌంటింగ్ తేదీ : మార్చి 14 ,2021 ఉదయం 8 గంటల నుంచి. 

వీటిల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( జివిఎంసి) కి ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఈ ఎన్నికలు

నిర్వహిస్తున్నారు. 

ఎన్నికలు జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ లు ఇవే,   

1 విజయనగరం జిల్లాలో  విజయ నగరం మున్సిపల్ కార్పొరేషన్,  

2 విశాఖపట్నం జిల్లాలో  గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, 

3 పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 

4 కృష్ణ

జిల్లాలో  విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ,  

5 కృష్ణ జిల్లాలో  మచిలీపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ 

6 గుంటూరు జిల్లాలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 

7 ప్రకాశం జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 

8 చిత్తూర్ జిల్లాలో చిత్తూర్ మున్సిపల్ కార్పొరేషన్ 

9

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 

10 వై ఎస్ ఆర్ కడప జిల్లాలో కడప మున్సిపల్ కార్పొరేషన్ 

11 కర్నూల్ జిల్లాలో కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ 

12 అనంతపురము జిల్లాలో అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ లకు పట్టాన ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. 

ఇతర స్థానిక సంస్థల్లో 75

మునిసిపాలిటీలు, పంచాయితీలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. 

శ్రీకాకుళం జిల్లాలో  ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ, పాలకొండ, లకు

విజయ నగరం జిల్లాలో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెల్లిమర్ల లకు 

విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం, ఎలమంచిలి లకు

తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం, తుని,

పిఠాపురం, సామర్ల కోట, మండపేట,  రామచంద్రపురం, పెద్దాపురం, ఏలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం లకు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపూర్, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం లకు

కృష్ణ జిల్లాలో నూజివీడు, పెడన, ఉయ్యురు, నందిగామ, తిరువూరు లకు 

గుంటూరు జిల్లాలో తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె,

మాచెర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల లకు

ప్రకాశం జిల్లాలో చీరాల, మార్కాపూర్, అడ్డంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు లకు

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వేంకటగిరి, ఆత్మకూరు (N), సూళ్లూరుపేట, నాయుడుపేట లకు

అనంతపురము జిల్లాలో హిందూపూర్, గుంతకల్, తాడిపత్రి, ధర్మవరం, కదిరి,

రాయదుర్గ్,  గుత్తి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, లకు

కర్నూల్ జిల్లాలో ఆదోని, నంద్యాల, యెమ్మిగనూరు, ధోన్, నందికొట్కూరు, గూడూరు (K), ఆళ్లగడ్డ, ఆత్మకూరు (K) లకు

వై ఎస్ ఆర్ జిల్లాలో ప్రొద్దటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల లకు 

చిత్తూర్ జిల్లాలో మదనపల్లె,

పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు లకు ఎన్నికలు జరుగనున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam