DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి వైభవంగా విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు

*గురువందనంతో ఉత్సవాలు ప్రారంభం: స్వాత్మానంద* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ ను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ఈ నెల 17 నుంచి అత్యంత వైభవంగా జరుగనున్నట్టు ఉత్తర పీఠాధిపతులు

 స్వామి స్వాత్మానందేంద్ర తెలియచేస్తున్నారు. ఈ వార్షికోత్సవాలు ఏర్పాట్లను ఆయన వివరించారు. విశాఖపట్నం శివారు ప్రాంతమైన చినముషిడివాడలోని పీఠం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు గురువందనంతో వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని,

పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యవేక్షణలో వార్షికోత్సవాలు జరుగుతాయన్నారు. విశాఖ నగరంలో వేద ధ్వని ప్రతిధ్వనించేలా వేదోక్తమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా దేశ రక్షణార్ధం రాజశ్యామల యాగం, లోక కళ్యాణార్ధం చతుర్వేద పారాయణ నిర్వహిస్తున్నామని అన్నారు. సర్వజనుల

హితాన్ని కాంక్షిస్తూ నిత్యం విశేష హోమాలు, యజ్ఞ యాగాదులు తలపెడుతున్నామని వివరించారు. 
ఇందులో భాగంగా 17వ తేదీన విద్యాభివృద్ధి కోసం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, వ్యాపారాభివృద్ధి కోసం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం, 18వ తేదీన మానవాళి రక్షణ కోసం మనుస్యూక్త హోమం, 19వ తేదీన  ఐశ్వర్యాభివృద్ధి, భోగప్రాప్తి కోసం రుద్రహోమం, 20వ

తేదీన వివాహసిద్ధి, సంతాన ప్రాప్తి కోసం షణ్ముఖ యాగం చేపడతామని తెలిపారు. ఈ వార్షికోత్సవాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం అధిష్టాన దైవం శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తూ లక్షతులసిపూజ, లక్ష బిళ్వార్చన, లక్ష పుష్పార్చన ఉంటాయన్నారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల, చంద్రమౌళీశ్వరులకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు

నిత్య పీఠ పూజ ఉంటుందని వివరించారు. ఫిబ్రవరి 20వ తేదీన రాత్రి 7 గంటలకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు  చెప్పారు. విశాఖ తీరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్నారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ వేడుకల్లో

ప్రత్యక్షంగా పాల్గొనున్నట్టు తెలిపారు. 
యజ్ఞ యాగాదులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హైందవ ధర్మ పరిరక్షణకు దోహదపడేలా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. విశేష పండితులను ఈ వేదికపై సత్కరిస్తామని

వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam