DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్టీల్ రాజకీయాలతో మునిసిపోల్స్ బరిలో వైకాపా, టీడీపీ 

*టీడీపీ నేతలు నిరాహార దీక్షలు, వైకాపా పాదయాత్ర* 

*బరిలోనే లేని బీజేపీ, అధిష్టానం ఆశీసులకై హస్తినకు నేతలు.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 16, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తున్నట్టు కేంద్రం లోని బీజేపీ

ప్రకటించగానే, రాష్ట్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు రాజకీయాలకు తెరలేపాయి. మునిసిపల్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రెండు పార్టీలు పోటా పోటీగా ప్రణాళికలు సిద్ధం చేసేసారు. టీడీపీ నేతలు నిరాహార దీక్ష ను మొదలెట్టగానే, దానికి మద్దతుగా ఇప్పడికే రాష్ట్రంలోని టీడీపీ నేతలందరూ

సంఘీభావం ప్రకటించేసారు. మంగళవారం చంద్రబాబు నాయుడు సైతం వస్తుండడంతో ఈ ఉద్యమ ప్రభావంతో వచ్చే ఓట్లన్నీ టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోతాయేమో అనే భయంతో అధికార పార్టీ  మంగళవారం తెల్లవారుఝామున ఆఘమేఘాల మీద దీక్ష శిబిరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్ దీక్షను భగ్నం చేసి, హమ్మయ్య అనుకుంది.  దీనికి అదనంగా  అధికార

పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ను వ్యతిరేకిస్తూ విశాఖ లో 22 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విజయసాయి రెడ్డి, అధికార పార్టీ ఎమ్మెల్యే లు స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర జరుగుతున్నా ఉద్యోగుల దీక్ష శిబిరానికి వెళ్ళినప్పుడు ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు అడ్డుకున్న

విషయం తెలిసిందే. అయినా ఈ ఉద్యమం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంతోనే పాదయాత్ర చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యమం లో ఎవరికీ ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది జనం నమ్మారు అనేది తెలియాలంటే. . .మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రావాల్సిందే. 

ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వివాదానికి ప్రధాన కారణమైన భారతీయ జనతా పార్టీ ఏ

స్థాయిలోనూ బరిలోనే నిలబడే స్థాయిని కోల్పోయి, అధిష్టానం నేతల ఆశీస్సుల కోసం హస్తిన కు పయనమయ్యారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అంటే ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని, కేంద్ర బీజేపీ, వీళ్ళకి అప్పోయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పడికే నామినేషన్లు వేసి, బరిలో నిలిచిన అభ్యర్థులు మాత్రం కనీసం

డిపాజిట్ అయినా దక్కితే బాగుండు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ముందుగానే ఓటమి ని నిర్ణయించుకున్న అభ్యర్థులు కనీసం ఓట్లు సాధించేందుకైనా కృషి చెయ్యకపోవడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam