DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఎం దృష్టికి ఉక్కు ప్రైవేట్ పై ఉద్యోగుల అభ్యంతరాలు

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* బుధవారం విశాఖ నగర పర్యటనకు వచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని విశాఖ విమానాశ్రయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కలసి వినతిపత్రం అందజేశారు. అందులో ప్రధానంగా వివరించిన అంశాలను విశాఖ ఉక్కు

పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె. అయోధ్య రామ్
తెలిపారు. కేంద్రం విశాఖ ఉక్కును 100% స్టేటజిక్ సేల్ కి పెట్టారని దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు కోరారు.
2)దీని మనుగడకు అవసరమైన సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని వారు వివరించారు.
3)దీని విస్తరణ

కోసం జరిగిన అప్పులను కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చడానికి అవసరమైన చర్చ జరపాలని వారు వివరించారు.
4)ఈ పోరాటానికి మన రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.
వీటికి స్పందిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ప్రారంభం అవుతాయని అప్పుడు

ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని హామీ ఇచ్చారు.
2) రాష్ట్రంలోని గనుల నాణ్యతాపరంగా సందేహాలు ఉన్నాయి కనుక ఒరిస్సా రాష్ట్రం లోని OMDC గనులను విశాఖ ఉక్కుకు కేటాయించే విధంగా ఆ రాష్ట్రం తో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.
3)పోస్కో వారి తో చర్చలు జరుపుతున్నాము వారిని విశాఖ ఉక్కు

భూముల్లో కాకుండా కృష్ణపట్నం, భావనపాడు ప్రాంతాల్లో పెట్టలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని ఆయన అన్నారు.
4) మా పార్టీ ఈ సమస్యలపై నిరంతరం మీతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే విశాఖ ఉక్కు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా మన పోరాటం చేయాలని వారిని కోరారు. అందుకు సంబంధించిన నాయకులు మన

పోరాటం వల్ల కర్మాగార ఉత్పత్తికి ఎటువంటి అంతరాయం కలిగించమని అన్నారు.
ఈ సమావేశంలో శ్రీ విజయసాయి రెడ్డి, స్థానిక విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ డా. కె. సత్యవతి, ఉపముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాసు, విశాఖ జిల్లా శాసనసభ్యులు, ప్రభుత్వ అధికారులు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు శ్రీ Ch. నరశింగరావు, జె.

సత్యనారాయణ మూర్తి (నాని), మంత్రి రాజశేఖర్, డి. ఆదినారాయణ, గంధం వెంకట్రావు, కె. యస్. యన్,మురళీరాజు, వై. మస్తనప్ప, బొడ్డు పైడిరాజు, దొమ్మెటి అప్పారావు, డి. సురేష్ బాబు, వరసాల శ్రీనివాస్, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam