DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సూర్యోదయానికి సప్తమి ఉన్న రోజునే రథసప్తమి 

*రథసప్తమి పై అపోహలు వద్దు, శాస్త్రవివరణ ఇదే.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 17, 2021  (డి ఎన్ ఎస్):* మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పర్వదినోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. అయితే ఈ సంవత్సరం సప్తమి రెండు రోజుల పాటు ఉండడంతో సూర్య ఆరాధనలు ఏ

రోజు చెయ్యాలి అనే సంశయం ఏర్పడింది. ఈ సందేహానికి ధర్మసింధు గ్రంధం లో సవివరంగా తెలియచేసింది.  
అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే రథసప్తమి జరుపుకోవాలి అని తెలియచేస్తోంది. 

నిర్ణయ సింధౌః- మాఘశుక్ల సప్తమీ  రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ  గ్రాహ్యా!

సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
/> అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్

అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ| ప్రయాగే యది లభ్యేత కోటిసూర్య గ్రహైః సమా||  ఇతి వచనాచ్చ యత్తు దివో దాసీయే  అచలా సప్తమీ దుర్గా శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా  ప్రాగ్యుతా సదా||  ఇతి షష్ఠీయుతత్వముక్తం!
/>  
తత్ యదా, పూర్వేహ్ని ఘటికాద్వయం షష్ఠీ, సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||

ఇత్యాది వచనముల చేత షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము అన్న వచనము తెలుస్తోంది. 
సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి

సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు  సమాప్తమైనప్పుడు  మాత్రమే షష్ఠీ యుత సప్తమి ని గ్రహించవలెను! 

అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే రథసప్తమి పర్వము ఆచరించవలెను
కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున ఫిబ్రవరి 19  శుక్రవారమే

రథసప్తమి జరుపుకోవాలి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam