DNS Media | Latest News, Breaking News And Update In Telugu

20 నుంచి రాజమండ్రి సింహాచలంలో చందనయాత్ర 

*22 న నిజరూప దర్శనం - 24 న  పుష్పయాగం* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 18, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీరంగం  శ్రీ మదుభయ వేదాన్తాచార్య పీఠం ట్రస్టు

ఆధ్వర్యాన ఈనెల 20 నుంచి 24 వరకూ చందన యాత్ర మహోత్సవాలు నిర్వ్హహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు కందాళం లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా నిబంధనలను అనుసరించి ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. 
   శ్రీ శ్రీ శ్రీ

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి మంగళాశాస నాలతో 
20 వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు గరుడ సేవ పేరిట  తిరువీధి  ఉత్సవం గొడవర్తి రాధాకృష్ణమాచార్యులు, ముప్పిరాల అనంతాచార్యులు, పరాశర రఘునాధ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలై, కంబాలచెర్వు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్  రోడ్డు, సాయికృష్ణ, భారత

బొమ్మలు, జాంపేట, కంబాలచెర్వు మీదుగా మళ్ళీ ఆలయానికి చేరుతుందని తెలిపారు. 21వ తేదీ ఆదివారం ఉదయం ఆరాధన, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకల్యాణ మహోత్సవం , మూర్తి కలశారాధన ఉంటాయని తెలిపారు. 22వ తేదీ సోమవారం తెల్లవారుఝామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన , ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకూ నిజరూప దర్శన

సేవ, రాత్రి 8గంటలకు సహస్ర ఘటాభిషేకం, రాత్రి 9గంటలకు చందన సమర్పణ,  తీర్ధ గోష్టి తదితర కార్యక్రమాలుంటాయని వివరించారు.  
  23వ తేదీ మంగళవారం ఉదయం ఆరాధన హోమాలు, చందన రూపంతో  నిత్యరూప దర్శనం, సాయంత్రం 5గంటలకు శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణ ఉంటాయని తెలిపారు.  24వ తేదీ బుధవారం ఉదయం 10గంటలనుంచి శ్రీ వారి ప్రసాదం, అన్న

సమారాధన, సాయంత్రం 6గంటలకు 11రకాల పుష్పాలతో  పుష్పయాగం, ఆలయం వెనుక పుష్కరిణిలో స్నానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారికి చందనం సమర్పించే భక్తులు ఆలయంలో సంప్రదించాలని, భక్తులు మాస్క్ లు ధరించి రావాలని కోరారు.

విలేకరుల సమావేశంలో ఆలయ ధర్మకర్తలు కె సూర్య సింహాచలం, కె నాగేశ్వరరావు, సిస్టర్స్

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam