DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి లో వైభవంగా రథసప్తమి వేడుకలు, తరిస్తున్న భక్తులు

*దర్శనం కోసం సామాన్యుల నుంచి అసామాన్యులు వరకూ* 

*తరించిన పీఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు* 

*రథసప్తమికి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు: . . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు SV,  బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)*  

*శ్రీకాకుళం, ఫిబ్రవరి 19, 2021  (డి ఎన్ ఎస్):* రథ సప్తమి పర్వదినోత్సవాన్ని

పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో ఆధ్యాత్మిక సందోహంతో ఓలలాడుతోంది. తెల్లవారుఝామునుంచే పీఠాధిపతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు,  భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. విశాఖ శ్రీ శారదా పీటం ఉత్తరాధికారి స్వాత్మానంద, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్,

శాసన సభాపతి తమ్మినేని సీతారాం లు కుటుంభ సభ్యులతో, శ్రీకాకుళం ఎంపీ కె. రామ్మోహన్ నాయుడు. కలెక్టర్ డా. జె నివాస్, ఎస్పీ అమిత్ బార్దర్, తదితరులతో పాటు, అధికార పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిఐపి, విఐపి లు,  సామాన్య భక్తుల కోసం వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసారు.  

రథసప్తమికి పకడ్బందీగా

బందోబస్తు ఏర్పాటు: . . .

భక్తులు కోవిడ్ నియమాలను తప్పక పాటించాలని, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలియచేస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ కోవిడ్ నియామా, నిబంధనలు పాటించాలని సూచించారు.

●    శాంతి యుతతంగా నిర్వహించేందుకు బందోబస్తును లా & ఆర్డర్ మరియు ట్రాఫిక్ గా 2 సెక్టార్లుగా

విభజించి , సుమారు 500.మంది పోలీసులు,రెండు షిప్టులుగా విధులు నిర్వహిస్తురుని అన్నారు.ఈ బందోబస్తుకు అదనంగా మరో 107 మంది ఇండయన్ ఆర్మీ ఉద్యోగం కొరకు శిక్షణ పొందుతున్న యువకులు స్వచ్చంధంగా పాల్గొంటున్నారు అని తెలిపారు.
●    ఒక్కో తరహా బందోబస్తు పర్యవేక్షణకు ఒక పోలీసు ఉన్నతాధికారిని నియమించినట్లుగా జిల్లా ఎస్పీ

తెలిపారు .
●    పి.స్.ఎన్.ఎం మిల్లు జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం దిశగా వెళ్ళునపుడు ఎడమ చేతి వైపు ఆటోలు, బస్సులు, కార్లు పార్కింగు చేయాలని, కుడి వైపున ద్విచక్ర వాహనాలు పార్కింగు చేయాలని సూచించారు.
●    వి.వి.ఐ.పి కార్లను సన్ రైజ్ హోటల్ వరకు అనుమతించి అచ్చట నుండి ప్రోటోకాల్ వాహనంలో ఆలయం వరకు వి.వి.ఐ.పిలను

దర్శనానికి తీసుకువెళ్ళడం జరుగుతుందని పేర్కొన్నారు.    వి వి.ఐ.పి., ల వారి వాహనాలుకు( కారు పాస్) మాత్రమే  పాసులు మంజూరు చేయడం జరిగింది అని అన్నారు.
●వి.ఐ.పిలు విధిగా పాస్ ను కలిగి ఉండాలని అన్నారు.
●    వి వి.ఐ.పి లకు గురువారం రాత్రి 12 గంటలు నుంచి 2.00 గంటలు వరకు వి.ఐ.పి లకు 3.00 గంటలు తర్వాత దర్శనంనకు ఏర్పాట్లు

చేసేమన్నారు.
●    స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
●    100 రూపాయలు, ఉచిత దర్శనం క్యూ లైన్సు ఇంద్ర పుష్కరిణి గుండా వెళుతుందని తెలిపారు.

విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 10 గంటల వరకు వారికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ●డిసిఎంఎస్ తోట వద్ద నుండి 5 వందల రూపాయల టికెట్ లైన్ ప్రారంభం అవుతుందని అన్నారు. 
●    బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బంది బాడీ వార్న్ కెమేరాలు ధరించే విధంగాను , ప్రధాన మార్గంలో సిసి

కెమేరాలను ,  డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి , ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘాను ఏర్పాటు చేసామన్నారు .
●    స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులు గుంపులుగా ఏర్పడకుండా , వెంటనే అక్కడి నుండి వెళ్ళి పోయేందుకు ఎనిమిది మూవింగు బృందాలను ఏర్పాటు చేసామన్నారు .
●    నిఘా ఏర్పాటు చేసేందుకు రూఫ్ టాప్ ల్లో

పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు , నేరాలు జరగకుండా అనుభవజ్ఞులైన క్రైం సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసామన్నారు .
●    ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకం గా పోలీసు సిబ్బందిని , అధికారులను కేటాయించి , పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపడతామన్నారు . వాహనాల పార్కింగు పార్కింగు స్థలాలను గుర్తించి , వాహనాల

పార్కింగు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు . ●ప్రజలకు సూచనలు చేసేందుకు , సమాచారాన్ని అందించేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగు సిస్టమ్స్ ను ఏర్పాటు చేసామన్నారు.
●సామాన్య భక్తులు సైతం ప్రశాతంగా, చక్కటి దర్శనాన్ని పొందుటకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేసామని ఎస్పీ తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam