DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గాల్వాన్ లోయలో సైన్యానికి సోలార్ హీట్ టెంట్లు ఉపయోగపడేనా?

*వాంగ్ ఛుక్ ప్రయోగం పై మిలిటరీ క్యాంప్ లో మరింత ఉత్తేజం* 

*బయట మైనస్ ఉష్ణోగ్రత ఉన్న టెంట్ లోపల ప్లస్ లోనే*  

*మొత్తం బరువు 30 కిలోల లోపలే. . 10 మంది వరకు ఏర్పాటు*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 20, 2021  (డి ఎన్ ఎస్):* అత్యంత క్లిష్టమైన మైనస్

డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న గాల్వన్ (కాశ్మీర్) లోయలోని వాతావరణం లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు ప్రత్యర్థి దేశాల సైనికులతో పాటు, వాతావరణం కూడా ఒక టార్గెట్ గానే మారిపోతుంది. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ మంచు లోయల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు కొంత ఊరట లభించే సమాచారం తెలుస్తోంది.

కాశ్మీర్ వాతావరణం లోని

మైనస్ ఉష్ణోగ్రతలనుంచి కొంత వరకూ రక్షించబడడానికి లడక్ కు చెందిన సోనమ్ వాంగ్చుక్ అనే పరిశోధన ఇంజనీర్ రూపొందించిన సోలార్ టెంట్ మిలిటరీ క్యాంపు లకు అందించే ప్రయత్నం జరుగుతున్నట్టు గా తెలుస్తోంది. ఆ సదుపాయం భారత సైనికులకు లభించినట్టయితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని రూపకర్త తెలియచేస్తున్నారు. అయన చేసిన

పరిశోధన ప్రకారం ఈ టెంట్ బరువు 30 కిలోలకు లోగానే ఉంటుంది, పైగా విడివిడిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి సునాయాసంగా తీసుకు వెళ్ళవచ్చు. ఒక టెంట్ లో 10 మంది వరకూ సౌకర్యంగానే ఉంటుంది.  ఈ టెంట్ బయట మైనస్ వాతావరణం ఉన్నప్పడికి, టెంట్ లోపల మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈయన సోషల్ మీడియా లో ప్రకటించిన సమాచారం ప్రకారం గాల్వన్

ప్రాంతంలో -14 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో ఈ టెంట్ లోపల + 15 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత ఉన్నట్టుగా తెలియచేసారు. వీళ్ళు చేసిన ప్రయోగాలు సత్ఫాలితాలు ఇచ్చి, భారత ప్రభుత్వం వీటికి అనుమతి ఇస్తే. .. అత్యంత మైనస్ డిగ్రీల వాతావరణంలో పహారా విధుల్లో ఉన్న సైనికులకు ఊరట లభించినట్టే అని భావించవచ్చు. 
ప్రస్తుతం వరకూ టన్నుల

కొద్దీ కిరోసిన్ ను వినియోగిస్తున్న సందర్భాల నుంచి బయట పడే అవకాశం ఉంది. ఈ సోలార్ టెంట్ వాతావరణానికి ఎటువంటి హాని కలుగకుండా తయారు చేసినట్టు తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam