DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి బీమా ఉద్యోగుల సంఘం సంఘీభావం

 

*బీమా రంగ సంస్థల ఉద్యోగుల సంఘం సదస్సు విజయవంతం* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడాన్ని ఖండిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ తీర్మానం చేసింది. ఆదివారం విశాఖ నగరం లో

ICEU ఆధ్వర్యంలో నిర్వహించిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సదస్సు 21-02-2021 కు మంచి స్పందన లభించింది. ఈ సదస్సుకు సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం కామేశ్వరి అధ్యక్షత వహించారు. సంఘం కార్యదర్శి ఎన్ రమణాచలం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకే కాక ఆంధ్రప్రదేశ్ కు ఆధారంగా తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేస్తే కార్మిక వర్గం

తిప్పికొడుతుందని, ప్రజలు కార్మికులు ఐక్యమై విశాఖ ఉక్కును కాపాడు కుంటామని అన్నారు. పోరాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలోని బీమా ఉద్యోగులు, BSNL, రైల్వే, పోర్ట్, బ్యాంకు, పోస్టల్  ఉద్యోగులతో జాయింట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో

Banks, Steel plant మరియు ఇతర మద్యతరగతి ఉద్యోగసంఘాల నాయకులు పాల్గొన్నారు

దక్షిణ మధ్య ప్రాంత ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘం ఉపాద్యక్షులు సతీష్ ( రాజమండ్రి ) మాట్లాడుతూ ఏ సంస్థ అయినా అభివృద్ధి లోకి వచ్చి, నిలబడింది అంటే కార్మికుల శ్రమ  ఎంతో ఉంటుందన్నారు. ప్రైవేట్ పేరుతొ ఆంధ్రప్రదేశ్ కె తలమానికంగా ఉన్న పరిశ్రమను

నిర్వీర్యం చేస్తే బీమా ఉద్యోగుల సంఘం ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందన్నారు. సి ఐ టి యు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్షంగా ఈ సంస్థ పై ఆధారపడి ఉన్నారన్నారు. ప్రైవేట్ పరం చేస్తే వీళ్లందరి జీవితాలు రోడ్డున పడతాయన్నారు. ఇప్పడికే ఉద్యోగుల సంఘం, రాజకీయ పార్టీల ప్రతినిధులు

ఇప్పడికే ప్రత్యక్షంగా పోరాటానికి దిగాయన్నారు. 

ఈ సమావేశంలో జీవన బీమా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభాకర రావు, వెంకటరావు, రవికుమార్, ఎల్ ఐ సి పెన్షనర్స్ సంఘం ప్రతినిధులు పాండు రంగన్, స్టీల్ ప్లాంట్ సంఘం ప్రతినిధి సత్యనారాయణ, జనరల్ బీమా సంఘం ప్రతినిధి శ్రీనివాస్, శ్రీరామ్మూర్తి, పోస్టల్ నాయకులు ఎం ఆర్ టి

రాజు, ఏజెంట్స్ యూనియన్ నాయకులు కెవి రమణ, బి ఎస్ ఎన్ ఎల్  నాయకులు సాగర్ ప్రసంగించారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని సదస్సు తీర్మానించింది

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam