DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రస్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ ప్రారంభం

*క్రీడలలో పురోహితులు సత్తా చూపాలి: నాదెండ్ల మనోహర్*

*పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 జట్లు, 120 కి పైగా క్రీడాకారులు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 22, 2021  (డి ఎన్ ఎస్):* దేవాలయాలలో నిత్యం పూజలు చేస్తూ లోకకళ్యాణం కోసం పాటుపడే పురోహితులు ఆటవిడుపుగా

 ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనడం అభినందనీయమని, ఈ రంగంలో కూడా వారు తమ సత్తా చూపాలని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  అన్నారు.స్థానిక  వి ఎల్ పురం మార్గాన్ని ఎస్టేట్స్ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ లీగ్ పోటీలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా

సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ పాల్గొని ప్రసంగించారు. నాదెండ్ల మాట్లాడుతూ ఎనిమిది రోజులపాటు జరిగే క్రికెట్ లీగ్ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 12 జట్లు, 120 కి పైగా క్రీడాకారులు పాల్గొనడం చూస్తుంటే పురోహితులలో క్రీడా స్పూర్తి ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు.

జాతీయస్థాయిలో పురోహితులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దేవాలయాల పై దాడులు,  అర్చకులు పై అక్రమ కేసులు బనాయించడం తదితర వ్యవహారాలపై జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారన్నారు.సమాజహితం కోరే పురోహితులను ప్రస్తుత పాలకులు గుర్తించాలన్నారు. పంచాయతీ ఎన్నికలలో సత్తా

చాటిన జనసేన రానున్న ఎన్నికలలో మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని,  పురోహితులకు కూడా సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ దేవాలయాలను పరిరక్షించుకునే బాధ్యత అందరిపైనా ఉందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్రికెట్ లీగ్ పోటీలలో పాల్గొన్న అయిన గ్రౌండ్ లో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ

కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర పి. ఎ . సీ నాయకులు కందుల దుర్గేష్, వై. శ్రీను ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్‌ శర్మ, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నండూరి వెంకట రమణ, నాయకులు బొడెం రవి కుమార్, తేజోమూర్తుల నరసింహమూర్తి, మామిళ్ళపల్లి అయ్యప్ప, ముత్యం శంకర్‌, టోర్నమెంటు నిర్వాహకులు

మణికంఠ, అజేయ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam