DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కపిలేశ్వరపురం హరికథ పాఠశాలకు పునర్వైభవం రావాలి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 24, 2021  (డి ఎన్ ఎస్):* ఒక విద్యార్థి ఎన్నో సంవత్సరాల కృషి, పట్టుదల ఉంటేనే ఏ కళలోనైనా రాణించగలరు. సంప్రదాయ కళలు, విద్యల్లో రాణించాలంటే మరింత తపన, తపస్సు చెయ్యాలి.  అయితే అలాంటి విద్యార్థులను తయారుచేసే సంస్థలే పాఠశాలలు. అయితే వాటికి తగిన ఆదరణ

కరువవడంతో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం హరికథ పాఠశాల ఒకటి.  

సంప్రదాయ కళలు అంతరించిపోకుండా భావి తరాలకు అందాలనే సంకల్పంతో ఎంతో మంది నేర్చుకోవాలనే సదుద్దేశ్యంతో హరికథా శిక్షణకు ప్రత్యేకంగా ప్రప్రధమంగా 10 జూన్ 1973 న తూర్పు గోదావరి జిల్లా

కపిలేశ్వరపురం జమీందారు యస్.బి.పి.బి.కె. సత్యనారాయణ రావు కపిలేశ్వరపురం హరికథా పాఠశాల ను స్థాపించారు. దీనికి ప్రధానాచార్యులుగా కడలి వీరదాసు ( శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి శిష్యుడు) ను నియమించారు. ఈ విద్య సంస్థ లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే విధంగా వారికీ ఉపకారవేతనాలు

కూడా అందిస్తున్నారు. ఈ పాఠశాలలో అయిదు సంవత్సరాల శిక్షణాకాలం పూర్తయిన తరువాత పరీక్షలను నిర్వహించి, "హరికథా ప్రవీణ"  అను ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, వారిని ప్రదర్శనకు యోగ్యులుగా నిర్ణయిస్తుంది. ఈ సంస్థ నుండి తయారైన బాలబాలికలు తెలుగులో మాత్రమే గాక సంస్కృతంలో కూడా హరికథలు చెబుతూ ఎన్నో సత్కారాలు పొందారు.

వారిలో ప్రముఖులు దాలిపర్తి ఉమామహేశ్వరి ఉజ్జయినిలో  కాళిదాస అకాడమీ వారు నిర్వహించే అంతర్జాతీయ సెమినార్ లో చేసిన ప్రదర్శనల ద్వారా హరికథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించాయి. ఇంతటి గొప్ప కళకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పాఠశాల అధ్యాపకులు, శిష్య బృందం కోరుకుంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam