DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ సమావేశాలకు ABN TV ని, ఆంధ్రజ్యోతి లపై బహిష్కరణ వేటు

*ఛానెల్ యాజమాన్యం బేషరతు క్షమాపణ చెప్పేవరకూ బ్యాన్*

*అధికారిక ప్రకటన విడుదల చేసిన ఏపీ బీజేపీ శాఖ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2021  (డి ఎన్ ఎస్):* పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్ నైతిక విలువలు గాలికొదిలేసి తెలుగుదేశం పార్టీ కరపత్రిక,

ప్రసార సాధనంలా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఇక నుంచి బహిష్కరిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన విడుదలైంది. బుధవారం రాష్ట్ర శాఖ కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు పేరిట విడుదల చేసిన లేఖలో కారణాలు వివరించారు. మంగళవారం రాత్రి ఏబీఎన్ టీవీ డిబేట్ లో బీజేపీ

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పై చెప్పుతో దాడి చేసిన కె. శ్రీనివాసరావు పై పోలీస్ కేసు పెట్టాలని ఛానెల్ ను బీజేపీ డిమాండ్ చేసిందని, అయితే యాంకర్ వెంకట కృష్ణ బేఖాతరు చేస్తూ అదే శ్రీనివాసరావు ను తిరిగి బుధవారం మరోసారి డిబేట్ కార్యక్రమానికి వక్తగా ఆహ్వానించడాన్ని తప్పు పట్టింది. దీనిపై పార్టీ

చాలా సీరియస్ గా ఉందని, టీవీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఏబీఎన్ టీవీ ఛానెల్ ను, ఆంధ్ర జ్యోతి దిన పత్రికను తమ పార్టీ రాష్ట్ర శాఖ బహిష్కరిస్తోందని తెలిపారు. ఇక నుంచి బీజేపీ తరపున ఎవరూ ఈ ఛానెల్ డిబేట్ లలో పాల్గొనరాదని తీర్మానించింది. టీవీ ఛానెల్ తమకు నచ్చిన వారిని డిబేట్ కు పిలిచి అదే బీజేపీ

ప్రతినిధులుగాను, వాళ్ళ మాటలే బీజేపీ వాయిస్ గానూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తే. . సదరు ఛానెల్ పై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

సదరు ఛానెల్ యాజమాన్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు బేషరతు క్షమాపణ చెప్పేవరకూ బ్యాన్ కొనసాగుతుందని ప్రకటించింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam