DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సప్తఋషి చారిటబుల్ శంకర యాత్రకు అపూర్వ ఆదరణ

*ఓంకారేశ్వర్ లో బృందానికి వేదపండిత కుటుంబం ఆత్మీయ స్వాగతం*  

*ఫిబ్రవరి 14 న మొదలైన యాత్ర 30 రోజుల పాటు భారత పరిక్రమణ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం కు చెందిన సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ వేదపాఠశాల సారధ్యంలో

చేపట్టిన భారత పరిక్రమణ శంకర యాత్ర 11 వ రోజు ఓంకారేశ్వర్ కు చేరుకుంది. ఈ నెల 14 న విశాఖ లోని సప్తఋషి ఆశ్రమం లో మొదలైన ఈ యాత్ర మార్చి 14 నాటికి విశాఖ చేరుకోనుంది. ఈ యాత్రలో అనుభవాలను వేదపాఠశాల నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవశర్మ DNS కు తెలియచేసారు. రాష్ట్రేతర ప్రాంతాల్లో సైతం వేదమాతకు ఎంతో వైభవం లభిస్తోందన్నారు. 11 వ రోజు యాత్ర

ఓంకారేశ్వర్ కు చేరుకుందని, తమ యాత్ర విషయాలను తెలుసుకున్న ఓంకారేశ్వర్ లోని ఓ వేదపండిత కుటుంబం ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో అద్భుతమైన అనుభూతి కలిగిందన్నారు. 

ఆదిశంకరాచార్యులు చేపట్టిన వేదయాత్ర స్ఫూర్తిగా 30 రోజుల పాటు నాలుగు వేదాల పారాయణలతో భారత దేశ ఆలయాలను సందర్శించనున్నట్టు తెలిపారు. ఈ యాత్రకు

ఫిబ్రవరి 14 న శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ యాత్ర లో ఒక్కక్క వేద పండిత బృందం ఒక్కో దిశలో ప్రయాణిస్తుందన్నారు. ఋగ్వేద,  కృష్ణ, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వ వేద పండితులు ఒక్కో దిశలోని ఆలయాలను సందర్శిస్తూ అక్కడ ఆయా వేద ఋక్కులను పఠనం చెయ్యడం జరుగుతుందన్నారు. 

ఈ బృందం ఇప్పడికే విశాఖ నుంచి తిరుమల,

మహారాష్ట్ర లోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, శృంగేరి లోని జగద్గురు ఆది శంకర పీఠం, కాలడి లోని ఆది శంకరుల నివాసం, కనకధారా ప్రవహింపచేసిన ప్రదేశం వరకూ గల పుణ్యక్షేత్రాల్లో వేదయాత్రను ముగించింది. 

ప్రస్తుతం ఓంకారేశ్వర్ క్షేత్రం ముగించుకుని ముందుకు సాగుతున్నట్టు తెలియచేసారు. 

శుక్ల / కృష్ణ

యజుర్వేదం: .. 

కంచి లోని విష్ణు వరదరాజ స్వామి ఆలయం, శివకంచి లోని కామాక్షి ఆలయం, కామకోటి పీఠం, అది శంకరాచార్య జన్మస్థానం కలది, గురువాయూర్, శ్రీనగేరి, శివమొగ్గ, కొల్హాపూర్, త్రయంబకేశ్వర, నాసిక్, ఓంకారేశ్వర, ఉజ్జయిని ( మహాకాళేశ్వర్), కాలభైరవ క్షేత్రం.

సామవేదం పారాయణ: 
ద్వారకా, కురుక్షేత్రం, శ్రీనగర్,

శంకరాచార్య హిల్స్,  

అధర్వ వేద పారాయణ:

జమ్మూ, జాగేశ్వర్, అయోధ్య, గయా, వారణాసి, త్రిపుర, కలకత్తా, విశాఖపట్నం. 

భారత దేశ తూర్పు భాగం (1 - 3 ) : సంపూర్ణ ఋగ్వేద పారాయణం.  
భారత దేశ దక్షిణ భాగం (3 - 5 ) : సంపూర్ణ శుక్ల యజుర్వేద పారాయణం. 
భారత దేశ దక్షిణ భాగం (5 - 7 ) : సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణం. 
/> భారత దేశ పశ్చిమ భాగం (7 - 9 ) : సంపూర్ణ సామవేద పారాయణం. 
భారత దేశ ఉత్తర భాగం (9 - 11 ) : సంపూర్ణ అధర్వ  వేద పారాయణం. 
 
సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ కృష్ణ యజుర్వేద స్మార్త పండితుల నేతృత్వం లో సాగుతున్న ఈ వేదం యాత్ర లో  పాల్గొనే వేదపండితులు వీరే: . . 

ఋగ్వేదం : శ్రీదత్త

శర్మ ఘనపాఠి  (విశాఖపట్నం), జి. కల్యాణ చక్రవర్తి ఘనపాఠి ( తిరుపతి)

శుక్ల యజుర్వేదం: కీలంబి రాఘవాచార్యులు - కాణ్వశాఖ  ( హైద్రాబాద్),  కుమార భారత సుబ్రహ్మణ్యాచార్యులు - కాణ్వశాఖ ( హైద్రాబాద్)

కృష్ణ యజుర్వేదం: జి. అరవింద కుమార్ ఘనపాఠి ( తిరుపతి), సన్నిధానం దీక్షితులు ఘనపాఠి (

హైద్రాబాద్).

సామవేదం : శ్రీనివాస్ జోషి ( హైద్రాబాద్). జీవం కుమార్ ( హైద్రాబాద్)

అధర్వ వేదం: రావూరి విజయ్ కుమార్ శర్మ ( గుంటూరు), అమన్ కుమార్ పాండే ( హైద్రాబాద్).
 
ఇరగవరపు హరీష్ శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ),
పాణిగ్రాహి కౌండిన్య శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ),
పేరెపు శశికాంత్ శర్మ (

కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ), 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam