DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రవ్యాప్తంగా అర్చక సమస్యల పరిష్కారానికే ఐక్యవేదిక

*క్షేత్రస్థాయిలో అర్చకులకు న్యాయం జరిపిస్తాం :ఐక్య వేదిక* 

*మంత్రి, అధికారులతో చర్చిస్తాం: ఎపి అర్చక ఐక్య వేదిక*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఫిబ్రవరి 25, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అర్చకులను దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలను

నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్తాయికి అందడం లేదని ఎపి అర్చక ఐక్య వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని చందావారి సత్రంలో గురువారం జరిగిన అర్చక ఐక్య వేదిక సమావేశంలో వివిధ జిల్లాల నుంచి అర్చకులు, సహాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతినిధులు మాట్లాడుతూ త్వరలో దేవాదాయ శాఖ మంత్రి,

దేవాదాయ కమిషనర్ ని కల్సి సమస్యలను ప్రస్తావిస్తామని తెల్పింది. అనంతరం చందా సత్రంలో ఎపి అర్చక ఐక్య వేదిక నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఎపి అర్చక ఐక్య వేదిక అధ్యక్షుడు కంఠం నందీశ్వర్, ఉత్తరాంధ్ర అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు, సంయుక్త కార్యదర్శి  కొత్తలంక మురళీకృష్ణ, తదితరులు

మాట్లాడారు.

ప్రధానంగా చర్చించిన అంశాలు.: . .

రాష్ట్రంలో అర్చక సంక్షేమ కోసం వివిధ అర్చక, ఆగమ సంఘాలు విడివిడిగా పనిచేయడం వలన అర్చక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, కొన్ని సమస్యల పరిష్కారానికి అవరోధంగా మారిందని అందుకే అర్చక శ్రేయస్సే ధ్యేయంగా అందరి మధ్యా ఏకాభిప్రాయం సాధిస్తూ, సమస్యల పరిష్కారం కోసం

ఎపి అర్చక ఐక్య వేదిక ఏర్పాటుచేసినట్లు వారు చెప్పారు. 

దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్చకులకు   వంశ పారంపర్య హక్కు సర్వీసు నిబంధనలు గురించి జీవో ఇచ్చారని తెలిపారు. 

ఇనాం భూములపై అనుభవదారు హక్కును రెవెన్యూ రికార్డులో నమోదు చేయించి , ప్రభుత్వం నుంచి రైతు భరోసా వంటి పధకాలను

అర్చకులందరికీలే అందేలా కృషిచేస్తామని చెప్పారు.

కన్సాలిడేట్ జీతంపై పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం వచ్చేవిధంగా, అలాగే పే స్కెలుపై పనిచేస్తున్న అర్చకులకు ఇంక్రిమెంట్స్ తో కూడిన పూర్తివేతనం అందేలా కృషి  చేయడంతో పాటు జీతాల చెల్లింపు ప్రభుత్వం నుంచి  గ్రాంట్ ఇన్ ఎయిడ్  మంజూరుకు అలాగే 5ఏళ్ళు

కన్సాలిడేట్ జీతంపై పనిచేసే అర్చకులను రెగ్యులర్ చేయడానికి కృషిచేస్తామని  ఎపి అర్చక ఐక్య వేదిక నాయకులు చెప్పారు. 

అర్చకులకు ఏ పార్టీతో సంబంధం ఉండదని, ప్రభుత్వంలో  ఎవరున్నా బాగుండాలని, మంచి పాలన సాగించాలని కోరుకుంటామని, అలాగే ప్రజా శ్రేయస్సు కాంక్షిస్తూ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని వారు ఒక

 ప్రశ్నకు సమాధానంగా  స్పష్టంచేశారు. 

ఈ సమావేశంలో ఎపి అర్చక ఐక్య వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామ శర్మ, కార్యదర్శి   సెక్రటరీ ఎం. ఏ. శేషాచార్యులు, ప్రతినిధులు జంధ్యాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి, ఖండవిల్లి కిరణ్ కుమార్, అత్తలూరి అక్షయలింగశర్మ, గూడూరు లక్ష్మీపతి శివాచార్య,

పరమేశ్వరరావు, అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితులు, వెలవలపల్లి తాతయ్య శాస్త్రి, అప్పనపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam