DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ కి బుద్ది చెప్పే బంద్ ఇది, కలిసి రండి : ప్రజలకు బొత్స పిలుపు

విశాఖపట్నం, జులై 23 ,  2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కొరకు, కేంద్రం వైఖరికి నిరసన à°—à°¾ మంగళ వారం తలపెట్టున రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలూ సంఘీభావం

ప్రకటించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ బొత్స సత్యన్నారాయణ పిలుపునించారు. సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ విభజన సమయంలో భారత పార్లమెంట్ లో తయారు చేసిన బిల్లు లోని అంశాలను నెరవేర్చకుండా నాలుగేళ్ల కాలం గడిపేసిన భారతీయ జనతా పార్టీ కి

రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెయ్యాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో సాక్షాత్ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఐదు

కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల   మనోభావాలను దెబ్బతీసిన ప్రధాని నరేంద్ర మోడీ వైఖరికి నిరసనగా à°ˆ బంద్ జరుగుతోందన్నారు. ఆంధ్రా కు ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా

ఇస్తామని ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ యే విశాఖపట్నం, తిరుపతి బహిరంగ సభల్లో ప్రకటించి, నేడు అధికారం లోకి వచ్చాక, మోళీ చేశారన్నారు. దీనికి వంత పాడిన తెలుగుదేశం

పార్టీ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. ముందు హోదా కావాలంటాడు, ఆ తర్వాత హోదా వద్దు, ప్యాకేజి యే ముద్దు అంట్టాడు,

మళ్ళీ తిరిగి హోదా కావాలంటాడు. అసలు ఏమి కావాలనుకుంటున్నాడో చంద్రబాబు కె తెలియడం లేదన్నారు. నలభై ఏళ్ళ అనుభవం అంటాడు, అంత అనుభవం ఇంతేనా అని చిన్న పిల్లలు సైతం

అడిగే స్థితికి దిగజారిపోయాడన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాష్ట్ర బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యార్థులు, విద్య సంస్థల యాజమాన్యాలు, కార్మిక

సంఘాలు, వ్యాపార వర్గాలు, ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీలు అందరూ సంఘీభావం ప్రకటించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలన్నారు. ఈ విలేకరుల సమావేశం వై ఎస్

ఆర్ కాంగ్రెస్  à°µà°¿à°¶à°¾à°–పట్నం నగర అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్, పార్లమెంట్ సమన్వయకర్త à°Žà°‚ వివి సత్యనారాయణ, మాజీ à°Žà°‚ ఎల్ ఏ తైనాల విజయకుమార్, ఉత్తర నియోజక వర్గ కేకే

రాజు, నగర మహిళా అధ్యక్షురాలు గారికిన గౌరీ, శివరామ కృష్ణ, ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధం సంఘం ప్రతినిధి బాబా, తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam