DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రవ్యాప్తంగా 21 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ 

*సింహాచలం ఈఓ - సూర్యకళ, ద్వారక తిరుమల - సుబ్బారెడ్డి*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 21మంది డిప్యూటీ కలెక్ట్లను బదిలీచేస్తూ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాధ్‌ దాస్‌ ఆదేశాలు జారీచేశారు. దీనిలో విశాఖ కలెక్టర్

కార్యాలయంలో జాతీయ రహదారుల విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎం.వి.సూర్యకళను దేవాదాయ శాఖ కు బదిలీ చేస్తూ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఈఓగా బదిలీ చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్ధానం ఈ ఓ గా జివి సుబ్బారెడ్డి ని నియమించారు. ఇతరుల్లో ఎం. విజయకుమార్‌ను

తెలుగుగంగా ప్రాజెక్ట్‌ నెల్లూరు విభాగం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గాను, జె. శివశ్రీనివాస్‌ను అసిస్టింట్‌ సెక్రటరీగా చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడకు, డి. కోదండరామిరెడ్డిని చిత్తూరు ఫారెస్ట్‌ సెంటిల్‌మెంట్‌ ఆఫీసర్‌గా బదిలీ చేసారు. ఎ. శ్రీరామచంద్రమూర్తిని

ఆంధ్రప్రదేశ్‌ విజిలెన్స్‌ కమీషన్‌ కు, ఎం. శ్రీదేవిని కృష్ణపట్నం హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌కు కాంపిటెంట్‌ అధారిటీగా ఒంగోలు కు, జె. అద్దయ్యను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గాను, ఎ.బి.వి.ఎస్‌.బి. శ్రీనివాస్‌ను తూర్పుగోదావరి జిల్లా కెఆర్‌ఆర్‌పికి

స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గాను, ఎన్‌. శ్రీనివాసులను తిరుపతి లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గా, ఎ.మహాలక్ష్మీదేవిని చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విజయవాడకు అసిస్టెంట్‌ సెక్రటరీ గాను, వి.సాధన (ఎ.ఎం.ఆర్‌.డి.ఏ) అమరావతి మెట్రోపాలిటన్‌ రివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీకు స్పెషల్‌

డిప్యూటీ కలెక్టర్‌ గా, డి. రామూనాయక్‌ జిఎన్‌ఎస్‌ఎఫ్‌ యూనిట్‌ 3 ముద్దనూరు కడప జిల్లా కు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గాను, బి. చిన్న ఓబులేసు నెల్లూరు జిల్లా డిస్ర్టిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌ గా, కె. హేమలతను నేషనల్‌ హైవే 16 విశాఖపట్నం భూ సమీకరణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, 
టి. బాపిరెడ్డి నెల్లూరు

జిల్లాలో ఆసరా, సంక్షేమ పథకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌ గాను, కె. కృష్ణవేణి ప్రకాశం జిల్లా ఆసరా, సంక్షేమ పధకాల అమలుకు జాయింట్‌ కలెక్టర్‌ గా, జి.వి. సత్యవాణి తూర్పుగోదావరి జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ గాను, కె.ఎం. బర్తారోస్మాండ్‌ నెల్లూరు జిల్లా ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్ ‌గా,

కె.ఎస్‌.భాగ్యరేఖ చీఫ్‌ కమీషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌, విజయవాడలో అసిస్టెంట్‌ సెక్రటరీ గాను, కె. దినేష్‌ కుమార్‌ను ఏపీఎన్‌ఆర్‌టి సొసైటీ సీఈఓగా డిప్యూటేషన్‌ పై నియామకాలు జరిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam