DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నెల్లూరు జిల్లా సైదాపురం ఎమ్మార్వో చంద్ర‌శేఖ‌ర్ స‌స్పెండ్

*సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యా యత్నం ఘటనలో*

*మ‌రో ఇద్ద‌రిపై వేటు చేస్తూ 22  నే క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఫిబ్రవరి 27, 2021  (డి ఎన్ ఎస్):* నెల్లూరు జిల్లా సైదాపురం ఎమ్మార్వో చంద్ర‌శేఖ‌ర్ ను స‌స్పెండ్ చేస్తూ జిల్లా

క‌లెక్ట‌ర్ శేష‌గిరిబాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌ల్లాం వీఆర్వో ముంగ‌ర వెంక‌ట ర‌మ‌ణ‌య్య‌, చిట్ట‌మూరు ఎమ్మార్వో కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న స‌బార్డినేట్ మారుబోయిన ప్ర‌సాద్ ల‌ను కూడా స‌స్పెండ్ చేశారు. గ‌తంలో చంద్ర‌శేఖ‌ర్ చిట్ట‌మూరు ఎమ్మార్వో కార్యాల‌యంలో త‌హ‌సీల్దారుగా చేశారు. ఆ

స‌మ‌యంలో ప్ర‌భుత్వ భూముల‌కు ప‌ట్టాలు ఇప్పిస్తాన‌ని నాగార్జున అనే వ్య‌క్తి నుంచి కోటిన్న‌ర రూపాయ‌లు లంచం తీసుకున్నాడ‌ని ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. చిట్ట‌మూరు నుంచి సైదాపురం మండ‌లానికి బ‌దిలీ కావ‌డంతో భూ ప‌ట్టాల విష‌యం అట‌కెక్కింది. అయితే లంచం తీసుకుని ఆ మొత్తాన్ని ఇవ్వ‌క‌పోవ‌డం,

ప‌ట్టాలు ఇప్పించ‌క‌పోవ‌డంతో బాధితుడు నాగార్జున కొన్నిరోజుల క్రితం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద భార్యాబిడ్డ‌ల ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అక్క‌డే వున్న క‌లెక్ట‌రేట్ సిబ్బంది, పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై బాధితుడిని కాపాడారు. డీఆర్వో

మ‌ల్లికార్జున స్వ‌యంగా వ‌చ్చి బాధితుడిని ప‌రామ‌ర్శించి, వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం క‌లెక్ట‌రుకు నివేదిక అంద‌చేయ‌డంతో ఎంక్వ‌యిరీ వేశారు. తాజాగా చంద్ర‌శేఖ‌ర్‌, వెంక‌ట ర‌మ‌ణ‌య్య‌, ప్ర‌సాద్ ల‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏపీ సచివాలయం వద్ద ఆత్మహత్యా యత్నం

ఘటనలో . .

పొలం ఆన్‌లైన్ చేస్తానని నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ (చిట్ట‌మూరు లో పనిచేసినప్పుడు) తమ దగ్గర ఒక కోటి రూపాయల పైన తీసుకుని మోసం చేశారని ఆరిగెల నాగార్జున దంపతులు ఆరోపణతో ఏపీ సచివాలయం వద్ద దంపతులు ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే. డీఆర్వో

మ‌ల్లికార్జున స్వ‌యంగా వ‌చ్చి బాధితుడిని ప‌రామ‌ర్శించి, వివ‌రాలు సేక‌రించి, నివేదికను కలెక్టర్ కు అందించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam